NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / కంటి సంరక్షణ: ఉప్పునీరు, వేడినీటిలో తడిసిన గుడ్డ, గ్రీన్ టీ బ్యాగ్ కంటికి చేసే మేలు
    తదుపరి వార్తా కథనం
    కంటి సంరక్షణ: ఉప్పునీరు, వేడినీటిలో తడిసిన గుడ్డ, గ్రీన్ టీ బ్యాగ్ కంటికి చేసే మేలు
    కంటి ఇబ్బందులను దూరం చేసే ఇంటి చిట్కాలు

    కంటి సంరక్షణ: ఉప్పునీరు, వేడినీటిలో తడిసిన గుడ్డ, గ్రీన్ టీ బ్యాగ్ కంటికి చేసే మేలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 23, 2023
    06:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సర్వేంద్రియాణాం నయనం ప్రధానంఅంటారు. అన్ని అవయవాల్లోకెల్లా కళ్ళు అత్యంత ముఖ్యమైనవని దానర్థం. కళ్ళకు చాలా రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి.

    కంటి శుక్లాల దగ్గర నుండి గ్లకోమా దాకా అనేక ఇబ్బందులు వస్తుంటాయి. వీటివల్ల కంటిచూపు తగ్గిపోవడం, మసక మసగ్గా కనిపించడం, ఒక్కోసారి పూర్తి చూపు కోల్పోవడం జరుగుతుంటుంది.

    అందుకే కళ్ళను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికోసం కొన్ని ఇంటిచిట్కాలు పని చేస్తాయి.

    ఉప్పునీరు: కంట్లో పేరుకున్న చెత్తను శుభ్రం చేయడంలో ఉప్పునీరు ప్రముఖ పాత్ర వహిస్తుంది. కన్నీళ్ళ మాదిరిగా ఇది కూడా కళ్ళను శుభ్రం చేస్తుంది. మరిగిన నీళ్ళను చల్లార్చి అందులో ఉప్పును కలిపాలి. ఆ తర్వాత దూదిని అందులో ముంచి కళ్ళను తుడవాలి.

    కంటి సంరక్షణ

    కంటి సంరక్షణకు ఉపయోగపడే ఇంటి చిట్కాలు

    గ్రీన్ టీ బ్యాగ్: కన్ను ఉబ్బడం నుండి గ్రీన్ టీ బ్యాగ్ రక్షిస్తుంది. కళ్ళు ఎర్రగా మారినపుడు గ్రీన్ టీ బ్యాగ్ పనిచేస్తుంది. చల్లగా ఉన్న గ్రీన్ టీ బ్యాగులను కన్నుల మీద పెట్టడం వల్ల కంటిలో కలిగే చిరాకు దూరమై హ్యాపీగా ఉంటుంది.

    వేడిగుడ్డ: కళ్ళు పొడిబారడం వల్ల కనుగుడ్ల చుట్టూరా ఒక పొర లాగా ఏర్పడుతుంది. ఇది ఏర్పడకుండా ఉండడానికి వేడిగుడ్డ హెల్ప్ చేస్తుంది. గోరువేచ్చని నీళ్ళలో గుడ్డను ముంచి కన్ను మీద 2-4నిమిషాల పాటు ఉంచాలి.

    ఆముదం నూనె: కళ్ళు ఉబ్బినపుడు దీన్నుండి మంచి రిలాక్స్ పొందవచ్చు. ఆముదం నూనెను కంటి చుట్టూరా మర్దన చేసుకుని గోరువెచ్చని నీటిలో తడిపిన గుడ్డను 10నిమిషాల పాటు కళ్ళమీద ఉంచాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నేత్ర ఆరోగ్యం

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    నేత్ర ఆరోగ్యం

    రాత్రుళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? చూపు కోల్పోయిన హైదరాబాద్ అమ్మాయి కథ తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025