ఎండ వేడిని భరించడానికి అమ్మాయిలు ఎలాంటి క్యాప్స్ ధరించాలో తెలుసుకోండి
వేసవి కాలం వేడి మొదలైపోయింది. ఈ వేడి నుండి రక్షించుకోవడానికి కళ్ళకు అద్దాలు వాడుతుంటారు. అయితే ఆడవాళ్ళలో చాలామంది తలకు క్యాప్ వాడాలన్న సంగతి మర్చిపోతారు. ఎండ వేడిని తట్టుకోవడానికి మాత్రమే కాదు ఎండ వల్ల జుట్టు పాడవకుండా ఉండేందుకు కూడా క్యాప్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఎండాకాలంలో క్యాప్ తప్పనిసరిగా వాడాలి. ఐతే మార్కెట్లో ఎలాంటి క్యాప్స్ అందుబాటులో ఉన్నాయో ఏ రకమైన క్యాప్ ఏ విధమైన డ్రెస్ కి సూట్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బేస్ బాల్ క్యాప్ ఈ రకం క్యాప్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి, ఎలాంటి డ్రెస్ మీదకైనా సరిగ్గా సెట్ అవుతాయి. వేరువేరు సైజుల్లో మార్కెట్లో దొరుకుతాయి. వీటిని ధరించి ఎక్కడికైనా వెళ్ళవచ్చు.
ఎండాకాలంలో ఉపయోగపడే క్యాప్స్ వెరైటీలు
బోటర్ క్యాప్స్ చాలా మృదువుగా ఉండే ఈ క్యాప్స్ ని 19వ శతాబ్దంలో చిన్నపిల్లల కోసం తయారు చేశారు. ప్రస్తుతం వీటిని ఆడవాళ్లు, మగవాళ్ళు అందరూ ఉపయోగిస్తారు. ఈ క్యాప్స్ ని ఫ్రెంచ్ నావికులు ధరించే క్యాప్స్ ని స్ఫూర్తిగా తీసుకుని తయారు చేశారు. అందుకే బోటర్ క్యాప్స్ అన్న పేరు వచ్చింది. బకెట్ క్యాప్స్ చూడడానికి క్యూట్ గా ఉండే ఈ క్యాప్, 1990 ల నాటి స్టైల్ ని గుర్తుకు తెస్తుంది. పాతకాలం నుంచి మనుగడలో ఉన్న ఈ క్యాప్ స్టైల్ ని ఇప్పటి డిజైనర్స్ తమ తమ కలెక్షన్లలో చేర్చుకొని సరికొత్తగా తయారు చేస్తున్నారు. ఇలాంటి క్యాప్స్ షర్ట్స్ మీదకు బాగా సూట్ అవుతాయి.