సమ్మర్ ఫ్యాషన్: వేసవిలో అందంగా మెరిసిపోయేలా చేసే సరికొత్త ఫ్యాషన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ సీజన్ లో ఆ సీజన్ కి తగినట్లుగా ఫ్యాషన్ ఫాలో అవడం సరైన పద్దతి. ఈ వేసవిలో మీకు సౌకర్యాన్నిచ్చేందుకు ఎలాంటి ఫ్యాషన్ అందుబాటులో ఉందో చూద్దాం.
ట్యాంక్ టాప్స్:
వేసవిలో ఆడవాళ్ళకు సరిపోయే ఫ్యాషన్ లో మొదటి స్థానంలో ఉంటుంది ట్యాంక్ టాప్స్. స్టైల్ గా, అందంగా ఉండడంతో పాటు అంతులేని సౌకర్యాన్ని అందిస్తాయి.
టాప్ సెలెబ్రిటీస్ అయిన బెల్లా హాడిడ్, కెండల్ జెన్నర్, కైయా జెర్బర్ మొదలగు వారందరూ ట్యాంక్ టాప్స్ ఫ్యాషన్ లో మెరిసారు.
స్లిప్ డ్రెస్సెస్:
పలుచని వస్త్రంతో తయారయ్యే స్లిప్ డ్రెస్సెస్, వేసవి కాలానికి సరిపోయే ఫ్యాషన్ అని చెప్పవచ్చు. పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు ఈ డ్రెస్సెస్ ని ప్రిఫర్ చేయవచ్చు.
ఫ్యాషన్
సమ్మర్ లో సూట్ అయ్యే ఫ్యాషన్
అసిమెట్రిక్ హెమ్:
2023లో ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాషన్ స్టైల్ అంటే ఇదేనని చెప్పవచ్చు. ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళు పొడుగ్గా కనిపిస్తారు. పొడుగు కాళ్ల సుందరిలా కనిపించాలంటే ఈ ఫ్యాషన్ ని ట్రై చేయండి.
కటౌట్ డ్రెస్సెస్:
వేలంటీనో, అవేక్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ ఫ్యాషన్ లో వస్త్రాలను తయారు చేస్తున్నాయి. ప్రియాంకా చోప్రా, దువా లిపా వంటి సెలెబ్రిటీస్, కటౌట్ ఫ్యాషన్ లో తళుక్కున మెరిసారు.
షీర్ టాప్స్ అండ్ డ్రెస్సెస్:
బోల్డ్ గా కనిపించే షీర్ టాప్స్, ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న సరికొత్త ఫ్యాషన్. ఛానెల్, నేన్సీ డొజాకా, వేలేంటీనో వంటి డిజైనర్ బ్రాండ్స్, ఈ ఫ్యాషన్ లో వెరైటీలను మార్కెట్ లోకి పట్టుకొస్తున్నాయి.