ఫ్యాషన్: మండు వేసవిలో కాళ్లకు సూట్ అయ్యే ఫుట్ వేర్
ఎండాకాలం వచ్చేసింది. పొద్దున్న ఏడింటికే ఎండ వేడి ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి టైమ్ లో మనం వేసుకునే బట్టలు, తొడుక్కునే చెప్పుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వేసవిలో కాలికి ఎలాంటి స్టైల్స్ బాగా సూటవుతాయో, ఎలాంటి చెప్పులు వేసుకుంటే వేడి తగలకుండా చల్లగా, సౌకర్యంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం. ఈ విషయంలో సాయం చేయడానికి చప్పర్ వ్యవస్థాపకుడు హర్షవర్థన్ చెబుతున్న విషయాలివే. లోఫర్స్: మండే ఎండాకాలంలో ఫార్మల్ గా కనిపించాలంటే లోఫర్స్ కన్నా మంచి ఆప్షన్ ఇంకోటి లేదు. పాతకాలం నాటి ఫ్యాషన్ లా కనిపించే లోఫర్స్, ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటాయని హర్షవర్ధన్ చెబుతున్నారు. జీన్స్, కాటన్, ఎలాంటి డ్రెస్ అయినా ఈజీగా సెట్ ఐపోతాయి.
స్ట్రాప్ షూస్, స్లిప్ ఆన్, స్నీకర్స్ షూస్ వల్ల కలిగే మేలు
స్ట్రాప్ షూస్: ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవారు ఇలాంటి షూస్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. క్లాస్ లుక్ తో మంచి సౌకర్యంతో అదిరిపోతాయని హర్షవర్థన్ చెబుతున్నారు. ఇందులో డబల్ స్ట్రాప్, సింగిల్ స్ట్రాప్ వంటి వివిధ రకాల డిజైన్లు కనిపిస్తాయి. స్లిప్ ఆన్: వేసవి కాలంలో ఇలాంటి ఫుట్ వేర్, మీకు మంచి సౌకర్యాన్నిస్తాయి. జీన్స్, చినోస్, షార్ట్స్, ట్రాక్స్.. దేని మీదకైనా ఈజీగా సెట్ అవుతుంది. బ్లాక్, వైట్, గ్రే వంటి రంగుల్లో గల స్లిప్ ఆన్ బాగుంటాయి. మెరిసిపోయే రంగుల్లో ఉండే స్లిప్ ఆన్ తీసుకోకపోవడమే మంచిది. స్నీకర్స్: పార్టీ అయినా, ఫంక్షన్ అయినా, టెన్నిస్ ఆడుతున్నా.. స్నీకర్స్ బాగుంటాయి. గతంలో వీటిని ఎక్కువగా అథ్లెటిక్స్ వాడేవారు.