Page Loader
పర్యావరణాన్ని రక్షించాలన్న ఆలోచన మీకుంటే మీ బీరువాలో ఎలాంటి బట్టలు ఉండాలో తెలుసుకోండి 
బట్టల వృధాను అరికట్టాలంటే చేయాల్సిన పనులు

పర్యావరణాన్ని రక్షించాలన్న ఆలోచన మీకుంటే మీ బీరువాలో ఎలాంటి బట్టలు ఉండాలో తెలుసుకోండి 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 14, 2023
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

పర్యావరణ పరిరక్షణ అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన విషయం. మనుషులు చేస్తున్న అనేక పనుల వల్ల పర్యావరణం పాడైపోతుంది. ముఖ్యంగా పెరిగిపోతున్న వృధా కారణంగా వాతావరణం కలుషితమవుతోంది. అనేక రకాల వ్యర్ధపదార్థాల్లో ఫ్యాషన్ వేస్ట్ కూడా ఒకటి. అతిగా బట్టలు కొనేయడం, పాత వాటిని రీసైకిల్ చేయకుండా భూమి మీద పడేయడం మొదలగు కారణాలవల్ల ఫ్యాషన్ వేస్టేజ్ పెరిగిపోతుంది. దీన్ని అరికట్టాలంటే మీ బీరువాలో ఎలాంటి బట్టలు ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం మీ దగ్గర తక్కువ క్వాలిటీ గల 20రకాల డ్రెస్సులు ఉండడం కన్నా ఎక్కువ క్వాలిటీ గల ఐదు డ్రెస్సులు ఉండడం మంచిది.

Details

బట్టలను ఎక్కువ కాలం ఉపయోగిస్తే పర్యావరణం ఎక్కువ కాలం బాగుంటుంది 

ఎక్కువ క్వాలిటీ గల డ్రెస్సులు ఎక్కువ కాలం మన్నుతాయి. క్వాలిటీ తక్కువగా ఉంటే తొందరగా పాడైపోవడం, చిరిగిపోవడం, రంగు చెరిగిపోవడం జరుగుతుంటుంది. అందుకే క్వాలిటీ ఎక్కువ ఉన్నా బట్టలను ఎక్కువ కాలం ఉపయోగించండి. పర్యావరణానికి అనుకూలంగా ఉండే బ్రాండ్లు వాడండి మీరెప్పుడు షాపింగ్ కి వెళ్ళినా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఖాదీ, లినెన్, ఆర్గానిక్ కాటన్ ఇంకా రీసైకిల్ చేయగలిగే బట్టలు మాత్రమే కొనుక్కోండి. సడన్ గా బట్టలు కొనవద్దు నచ్చింది కదా అని చెప్పి సడన్ గా బట్టలు కొనకూడదు, దానివల్ల మీ జేబుకు చిల్లు పడటమే కాకుండా పర్యావరణానికి నష్టం కలుగుతుంది. మీకు నిజంగా ఆ బట్టలు అవసరం ఉన్నట్లయితేనే కొనండి.