పొట్టిగా ఉన్న మగవాళ్ళు పొడవుగా కనిపించాలంటే పాటించాల్సిన ఫ్యాషన్ టిప్స్
ఈ వార్తాకథనం ఏంటి
పొట్టిగా ఉన్నవాళ్ళు ఫ్యాషన్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసుకునే బట్టలు, జుట్టు నుండి చేతికి పెట్టుకునే వాచ్ వరకూ అన్నింట్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.
లేదంటే మరింత పొట్టిగా కనిపించే అవకాశం ఉంటుంది. ఐతే పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా కనిపించవచ్చా అని మీకు సందేహం రావచ్చు. యెస్, కొన్ని ఫ్యాషన్ టిప్స్ పాటిస్తే పొడవుగా కనిపిస్తారు.
ఆ ఫ్యాషన్ టిప్స్ ఏంటో చూద్దాం.
నడుము పైభాగానికి ప్యాంట్ వేసుకోవాలి: పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా కనిపించాలంటే వాళ్ళ కాళ్ళు పొడవుగా కనిపించాలి. దానికి ఒక్కటే మార్గం. తాము వేసుకునే ప్యాంట్ ని నడుము పైభాగం వరకూ వేయాలి.
పిరుదుల పై వరకూ ప్యాంట్ వేసుకుంటే మీరు మరింత పొడవుగా కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫ్యాషన్
పొట్టిగా ఉన్నవారు పొడవుగా కనిపించడానికి టిప్స్
వదులుగా ఉండే ప్యాంట్స్ అసలే వద్దు : వదులుగా ఉండే టీ షర్టులు, ప్యాంట్ల వల్ల మీ శరీరాకృతి వింతగా కనిపిస్తుంది. దానివల్ల మరింత పొట్టిగా కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే మీ చర్మానికి మరీ అతుక్కుపోకుండా అలా అని పూర్తి వదులుగా కాని బట్టలు వేసుకోండి.
ప్యాటన్స్ మీద దృష్టి పెట్టండి: మీరు పొడవుగా కనిపించాలని మీకుంటే అడ్డగీతలున్న షర్ట్స్ వేసుకోవద్దు. నిలువు గీతలున్న వాటిని మాత్రమే ఎంచుకోండి.
షూస్: ఎలివేటర్ షూస్ అని పిలవబడే హైట్ ఎక్కువగా ఉండే షూస్ వాడండి. దానివల్ల మీరు ఏమాత్రం పొట్టిగా కనిపించరు.
యాక్సెసరీస్: మీకు సరిపోయే వస్తువులనే వాడండి. మీ మణికట్టు సన్నగా ఉండే చాలా చిన్న డయల్ ఉండే వాచ్ వాడండి.