ఫ్యాషన్: వేసవిలో పలాజో ప్యాంట్ ధరించాలనుకునే వారు ఈ స్టైల్ టిప్స్ పాటించండి
పలాజో అనేది ప్యాంట్ లో రకం. ఇది మహిళలకు మాత్రమే. ప్యాంట్ స్టైల్స్ లో ఉండే చాలా రకాల్లో ఇదొకటి. సాధారణంగా వేసవిలో పలాజోని ధరించడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ పలాజో ప్యాంట్లు 1960లో భారతదేశానికి పరిచయం అయ్యాయి. చాలా సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఆకర్షణీయంగా ఉండడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం పలాజోని ధరించడంలో ఉండే స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. క్రాప్ టాప్ తో పలాజో: వేసవిలో తేలికగా ఉండే బట్టలు వేసుకోవాలని అనుకుంటారు. బరువైన, అసౌకర్యంగా ఉండే బట్టల వైపు మొగ్గు చూపరు. అయితే డార్క్ కలర్ పలాజో ప్యాంట్ ధరించి, తెలుగు రంగు క్రాప్ టాప్ ధరిస్తే మంచి లుక్ వస్తుంది.
లేడీ బాస్ లా అదిరిపోవడానికి కావాల్సిన పలాజో స్టైల్
ఫార్మల్ షర్ట్, బ్లేజర్ తో పలాజో: ఆఫీసుకు వెళ్లేటపుడు డార్క్ గ్రే పలాజో ధరించి దాని మీదకు ఫార్మల్ షర్ట్, బ్లేజర్ ధరిస్తే, బిజినెస్ మెన్ లాంటి లుక్ వచ్చేస్తుంది. ఫార్మల్ షర్ట్ ని టక్ చేసి, దానిపైన బ్లేజర్ వేస్తే లేడీ బాస్ లా అదిరిపోతారు. కుర్తాతో పలాజో: సాంప్రదాయ బద్దంగా కనిపించాలనుకుంటే షార్ట్ కుర్తా మీద పలాజో ధరించండి. మెరూన్ కలర్ పలాజో మీద తెలుపు రంగు షార్ట్ కుర్తా ధరించి, చెవులకు జుంకీలు పెట్టుకుంటే మీకు సరికొత్త లుక్ వస్తుంది. ట్యాంక్ టాప్: సింపుల్ గా, సౌకర్యవంతంగా ఉండాలంటే ట్యాంక్ టాప్ మీదకు పలాజో ధరించవచ్చు. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు ఈ స్టైల్ బాగుంటుంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి