ఫ్యాషన్: ఫ్లోరల్ ఎడిషన్ దుస్తుల్లో వేసవిలో ధరించాల్సిన వెరైటీలు తెలుసుకోండి
ప్రతీ సీజక్ కు ఒక్కో రకమైన ఫ్యాషన్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ వేసవిలో ఫ్లోరల్ ఎడిషన్ దుస్తులు ధరించడం బాగుంటుంది. దుస్తుల మీద పువ్వుల డిజైన్లు కనిపించడాన్నే ఫ్లోరల్ ఎడిషన్ దుస్తులు అంటారు. డేట్ కి వెళ్ళినా, గర్ల్స్ అందరూ కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నా, ఈ ఫ్లోరల్ ఎడిషన్ దుస్తులు బాగా సూట్ అవుతాయి. ఈ ఎడిషన్ లో చాలా రకాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. మైక్రో ప్రింట్స్: చిన్న మిడ్డీలు, స్కర్ట్ లకు మైక్రో ప్రింట్స్ సరిగ్గా సూట్ అవుతాయి. లేతరంగుల్లో ఉండే పువ్వుల డిజైన్లు ఉంటే బెటర్. ఇలాంటి దుస్తులు ధరించినపుడు నెత్తిమీద టోపీ, కళ్ళకు అద్దాలు బాగుంటాయి.
వివిధ రకాల ఫ్లోరల్ ఎడిషన్ ప్రింట్స్
లార్జ్ బ్లూమ్స్: పెద్ద పెద్ద పువ్వులు కనిపించే డిజైన్ గల దుస్తులు మీకు సరికొత్త అందాన్నిస్తాయి. చూడడానికి చాలా బోల్డ్ గా ఉండే ఈ డిజైన్లు, మీకు కొత్త క్యారెక్టను ఇస్తాయి. కుర్తాలు వంటి దుస్తుల మీద పెద్ద పువ్వుల డిజైన్ బాగుంటుంది. ట్రాపికల్ ప్రింట్: ఈ ప్రింట్ గల దుస్తులు పర్యాటకానికి సెట్ అవుతాయి. ఈ డిజైన్లలో పర్యావరణానికి సంబంధించిన పువ్వులైనా, పండ్లు అయినా, జంతువులు అయినా ఉండవచ్చు. టాప్స్, జంప్ సూట్స్, షర్ట్స్ మీద ఈ డిజైన్లు బాగుంటాయి. రోజ్ గార్డెన్: మీ దుస్తుల మీద రోజా పూల తోట పరుచుకుని ఉండే డిజైన్ ఇది. ఈ డిజైన్ పాతదే అయినా మీకు మంది అందాన్ని తీసుకొస్తుంది.