ఫాదర్స్ డే 2023: మీ తండ్రికి బహుమతిగా ఏమివ్వాలో ఇక్కడ తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు. వేలు పట్టి నడిపిస్తూ ప్రపంచానికి అర్థం చెబుతాడు నాన్న. పిల్లల జీవితాల్లో సంతోషాన్ని తీసుకొచ్చేందుకు తన జీవితాన్ని త్యాగం చేస్తుంటాడు నాన్న.
అన్నీ చేసి కూడా తననెవరూ గుర్తించకపోయినా పెద్దగా ఫీలవడు. నాన్న కళ్ళలో కన్నీరు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తుంది.
జూన్ మూడవ ఆదివారం రోజున ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 18వ తేదీన ఫాదర్స్ డేని జరుపుకుంటారు.
ఈ నేపథ్యంలో మీ తండ్రికి ఎలాంటి బహుమతులు బాగుంటుందో ఇక్కడ చూద్దాం.
నాన్న కోసం వంట వండండి:
చికెన్, మటన్ వెరైటీ ఏదైనా మీ నాన్నకు ఇష్టమైన వంటకాన్ని మీ చేత్తో వండితే బాగుంటుంది.
Details
అమ్మానాన్నతో చిన్న ట్రిప్
మీ నాన్నతో ఒకరోజు:
చిన్నపిల్లలు ఎప్పుడూ నాన్న కావాలని ఏడవడం, ఎప్పుడూ నాన్న చుట్టూనే తిరగడం చేస్తుంటారు. పెద్దయ్యాక నాన్నతో గడిపే సమయం తగ్గిపోతుంది.
ఫాదర్స్ డే రోజున మీ నాన్నతో కాలక్షేపం చేయండి. ఓటీటీలో టీవీ చూడటం, థియేటర్ లో సినిమాకి వెళ్ళడం బాగుంటుంది.
జిమ్ వస్తువులు:
మీరు యవ్వనంలోకి వస్తుంటే మీ నాన్న వయసు వృద్ధాప్యానికి దగ్గరవుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్స్ ట్రా కేర్ అవసరం. అందుకే మీ నాన్నకు జిమ్ ఎక్విప్మెంట్ కొనివ్వండి.
చిన్న ట్రిప్:
మీ నాన్న కారును వాష్ చేయండి. పూర్తిగా క్లీన్ చేసి, మీ అమ్మానాన్నలతో కలిసి మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడే భోజనం చేయండి.