
Thandai: శివరాత్రి ఉపవాసం సమయంలో ఆకలిగా అనిపిస్తుందా? శక్తి కావాలంటే ఈ తాండై పానీయం తాగండి!
ఈ వార్తాకథనం ఏంటి
మహా శివరాత్రి రోజున ఎంతో మంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. ఉపవాస సమయంలో కొన్ని రకాల పండ్లు, పానీయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే, రోజంతా ఏమాత్రం ఆహారం తీసుకోకుండా ఉంటే శక్తి తగ్గిపోతుంది. ఈ సమయంలో తాండై పానీయం తాగితే శక్తిని పొందవచ్చు. అంతేకాదు దీనిని శివరాత్రి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. మహాశివరాత్రి ప్రత్యేకత హిందూ మతంలో మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ శివ పార్వతులకు అంకితం చేస్తారు. భోళేనాథుడు పార్వతీదేవితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రోజుగా శివరాత్రిని పండుగగా జరుపుకుంటారు. శివభక్తులు ఈ రోజున పూజలు నిర్వహించి, భక్తితో ఉపవాసం ఉంటారు. శివలింగానికి అభిషేకం చేయడం కూడా అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు.
Details
ఉపవాసం, ఫలహార ఆహారం
ఈ ఉపవాస సమయంలో ఫలహార పదార్థాలను తీసుకోవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా బలహీనంగా అనిపించే వారు సాత్విక ఆహారం తీసుకోవచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉపవాసం పాటించవచ్చు. అయితే ఆకలిగా అనిపించినప్పుడు శరీరానికి శక్తినిచ్చే తాండై పానీయం తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల శక్తి పెరుగుతుంది, పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. తాండై పానీయం తయారీ విధానం తాండై తయారు చేసుకోవడం చాలా సులభం. దీని కోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
Details
కావాల్సిన పదార్థాలు
- బాదంపప్పులు - 10 రోజ్ వాటర్ - 2 స్పూన్లు కేవ్రా ఎసెన్స్ - 1 టేబుల్ స్పూను పూర్తిగా కొవ్వు ఉన్న పాలు - 1 లీటరు కుంకుమపువ్వు రేకులు - 7 చక్కెర - రుచికి తగినంత పిస్తా - 1 టేబుల్ స్పూను గసగసాలు - 1 టేబుల్ స్పూను జీడిపప్పు - 1 టేబుల్ స్పూను సోంపు గింజలు - 1 టేబుల్ స్పూను మిరియాలు - ½ టీస్పూను యాలకులు - 2
Details
తయారీ విధానం
1. స్టవ్ మీద గిన్నె పెట్టి పాలను మరిగించి చల్లర్చాలి. 2. చల్లబడిన పాలల్లో చక్కెర, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. 3. బాదంపప్పులను ఒక గిన్నెలో నీటిలో నానబెట్టి 7 గంటల తర్వాత తొక్క తొలగించాలి. 4. మరో గిన్నెలో పిస్తా, గసగసాలు, జీడిపప్పు, సోంపు గింజలు, మిరియాలు, యాలకులు వేసి నానబెట్టాలి. 5. నానబెట్టిన బాదంపప్పులతో పాటు మిగతా పదార్థాలను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. 6. ఈ పేస్ట్‌లో రోజ్ వాటర్, కేవ్రా ఎసెన్స్ వేసి బాగా కలిపి మరిగించిన పాలలో కలపాలి. 7. ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో వేసి ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి.
Details
తాండై పానీయం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
తాండైలో ఉపయోగించే బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, గసగసాలు, సోంపు గింజలు, మిరియాలు వంటివి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. శరీరానికి శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిని మహాశివరాత్రి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ తాండై పానీయం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తిని అందించే ఉత్తమ పానీయంగా చెప్పవచ్చు. మహాశివరాత్రి రోజున దీన్ని తయారు చేసి శివునికి సమర్పించి ప్రసాదంగా తీసుకోవచ్చు.