NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Health Tips: ఆహరం తిన్న వెంటనే అసౌకర్యంగా ఉందా? ఈ తప్పులు చెయ్యొద్దు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Health Tips: ఆహరం తిన్న వెంటనే అసౌకర్యంగా ఉందా? ఈ తప్పులు చెయ్యొద్దు!
    ఆహరం తిన్న వెంటనే అసౌకర్యంగా ఉందా? ఈ తప్పులు చెయ్యొద్దు!

    Health Tips: ఆహరం తిన్న వెంటనే అసౌకర్యంగా ఉందా? ఈ తప్పులు చెయ్యొద్దు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 28, 2025
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆహారం మన ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతుంది. పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవు, కానీ చాలా మంది ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని తప్పులను చేస్తుంటారు.

    వేగంగా తినడం, నమలకుండా ఆహారం తీసుకోవడం, జీర్ణం కాని ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి అనేక సందర్భాల్లో కలత కలిగిస్తాయి.

    ఈ కారణంగా ఆహారం తినడంతో కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటించాలి.

    కొంతమందికి, కాస్త ఆహారం తీసుకున్నా, కడుపు నిండుగా అనిపిస్తుంది.

    Details

    నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తప్పవు

    మరికొందరికి వేగంగా తినడం లేదా అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కడుపు ఉబ్బరాన్ని నిర్లక్ష్యం చేస్తే, దీర్ఘకాలంలో అది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

    ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు పాటించడం చాలా ముఖ్యమై ఉంటుంది.

    ఆహారం తీసుకునే ముందు లేదా తర్వాత అధికంగా పండ్లు తినకూడదు, ఎందుకంటే ఇవి కడుపులో గ్యాస్ ఏర్పడటానికి కారణం కావచ్చు.

    అలాగే ఆహారం తిన్న వెంటనే వాకింగ్ చేయడం కూడా మంచిది కాదు. 10 నిమిషాల తర్వాత వాకింగ్ చేయడం వల్ల జీర్ణ ప్రక్రియ సురక్షితంగా జరగుతుంది.

    Details

    కూల్ డ్రింక్స్ తీసుకోవడం కూడా నివారించాలి

    తిన్న తర్వాత సోడాలు లేదా కూల్ డ్రింక్స్ తీసుకోవడం కూడా నివారించాలి. వాటిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ కడుపులో గ్యాస్ సృష్టించి, ఉబ్బరాన్ని పెంచుతుంది.

    ఆహారం తినేటప్పుడు బాగా నమిలి తినడం చాలా ముఖ్యం. కనీసం 32 సార్లు నమిలి తినాలని పెద్దలు సూచిస్తారు.

    రాత్రి సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

    క్యాలి ఫ్లవర్, క్యాబేజి, ఉల్లిపాయ, వెల్లుల్లి, బటానీలు, దుంపలు వంటి ఆహార పదార్థాలను రాత్రి తీసుకోవడం మంచిది కాదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    జీవనశైలి

    Pistachios: కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి.. రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడానికి.. వీటిని తీసుకోవాల్సిందే లైఫ్-స్టైల్
    Ginger Tea: అల్లంలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఈ చాయ్ రోజు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు!  లైఫ్-స్టైల్
    Health Benefits Of Amla Juice: ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..! లైఫ్-స్టైల్
    Blue Tea: బరువు తగ్గి, యవ్వనంగా కనిపించేందుకు ఈ స్పెషల్ బ్లూ టీ బెస్ట్.. లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025