Diwali 2023: దీపావళి పండుగకు కచ్చితంగా చేసే.. ఈ ఐదింటి గురించి తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
హిందువులకు దీపావళి చాలా ముఖ్యమైన పండుగ. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ వేడుకను చేసుకుంటారు.
ఈ ఏడాది నవంబర్ 12న దీపావళి పండుగ జరుపునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా కచ్చితంగా పాటించాల్సిన 5 సంప్రదాయాలు, ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటిని శుభ్రపరచడం
దీపావళికి ముందు ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోని ప్రతి మూలను కచ్చితంగా శుభ్రం చేసుకుంటారు.
ఈ క్రమంలో లక్ష్మి దేవి, గణేశుడి పూజించడం కోసం పూజ గదిని శుభ్రం చేయడమే కాకుండా అందంగా అలంకరించుకుంటారు. ఇల్లును శుభ్రపర్చుకొని, అలంకరించిన ఇల్లు పండుగ వాతావరణాన్ని కలిగిస్తుంది.
దీపావళి
లక్ష్మీపూజ
దీపావళి వేళ.. కచ్చితంగా లక్ష్మీ దేవి, గణేశుని కటాక్షం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. తమకు సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు, అదృష్టాన్ని ప్రసాదించమని లక్ష్మీ దేవిని వేడుకుంటారు. అదే సమయంలో అడ్డంకులను తొలగించాలని గణేశుడిని ప్రార్థిస్తారు.
షాపింగ్
దీపావళి అనగానే గుర్తుకొచ్చేది షాపింగ్. దీపావళి సందర్భంగా చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. ఇలా కొనుగులో చేడయం అదృష్టంగా భావిస్తారు.
అంతేకాకుండా.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా కిచెన్‌వేర్, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్‌లు, ఫర్నీచర్, దుస్తులు భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తాయి.
ఈ పండుగ వేళ.. వ్యాపారం భారీ ఎత్తున జరుగుతుంది. వాహనం కొనడానికి, కొత్త ఆస్తి సముపార్జనలతో సహా పెట్టుబడులు పెట్టడానికి దీపావళిని అనువైన వేడుకగా భావిస్తారు.
దీపావళి
దీపాలతో అలంకరించడం
దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ వేడుక నేపథ్యంలో సాంప్రదాయిక పద్ధతిలో చేతితో తయారు చేసిన మట్టి దీపాలను నూనె లేదా నెయ్యితో నింపి, వెలిగిస్తారు. ఇంటి లోగిళ్లను ఆ దీపాలను అలంకరిస్తారు.
హిందూ పురాణాల ప్రకారం, దుర్మార్గంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా, 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత లక్ష్మణుడు, భార్య సీతతో కలిసి శ్రీరాముడు ఆనందంగా ఇంటికి తిరిగి రావడానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటారు.
ఈ క్రమంలో చీకట్ల తొలగిపోయి.. వెలుగును ఆహ్వానించే ఉద్దేశంతో ఇంటి లోగిళ్లను దీపాలతో అలంకరిస్తారు.
బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం
దీపావళి పండుగ వేళ.. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది అనాది ఆచారంగా వస్తుంది. స్వీట్లు, డ్రైఫ్రూట్స్, ఫుడ్ బాస్కెట్‌లు, వివిధ బహుమతులను ఇష్టమైన వారికి గిఫ్ట్‌లను అందజేస్తారు.