
వాతావరణంలో మార్పులు రాకుండా ఉండాలంటే మీ డైలీ రొటీన్ లో చేసుకోవాల్సిన మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మనిషి చేసే పనుల వల్ల పర్యావరణం కలుషితమవుతోంది. దీనివల్ల వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి.
ఈ మార్పులు మనిషి మనుగడకు కష్టతరం చేస్తాయి. అందుకే వాతావరణంలో మార్పులు రాకుండా మనవంతుగా కొన్ని పనులు చేయాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఆఫీస్ కి వెళ్లడానికి కార్ల బదులు మరొక ఆప్షన్
మీరున్న చోట నుండి ఆఫీస్ కి వెళ్లడానికి దూరం తక్కువగా ఉంటే బైక్, కారు లాంటివి కాకుండా సైకిల్ తీసుకెళ్లండి. అది ఇబ్బందనుకుంటే పబ్లిక్ రవాణా ఉపయోగించండి.
లేదు, కఖచ్చితంగా కారులోనే వెళ్లాలనుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించండి. వీలైతే రవాణా అవసరం లేకుండా వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఎంచుకోండి.
Details
వాతావరణంలో మార్పు తీసుకువచ్చే మాంసం
మాంసం తినడం తగ్గించాలి
పశువుల పెంపకము, వాటి ద్వారా వచ్చే ఉత్పత్తులు, వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల వాతావరణం మార్పు చెందుతుంది.
పశువుల పేడ, ఎరువులను సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లోని నీటి వనరులు కలుషితం అయిపోతాయి.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
సింగిల్ యూస్ ప్లాస్టిక్ స్థానంలో ఇతర ప్రత్యామ్నాయాలను చూడాలి. ప్లాస్టిక్ కారణంగా మనభూమి, సముద్రాలు కలుషితం అవుతున్నాయి.
తగ్గించడం, మళ్ళీ ఉపయోగించడం, రీసైకిల్:
మనం చేసే వృధాను తగ్గించాలి. ప్రతీసారి కొత్త వాటిని కొనకుండా పాతవాటిని వినియోగించాలి. ఇక చివరగా పాత వాటిని రీసైకిల్ చేసి కొత్తగా తయారు చేయాలి.