ప్రపంచ పర్యావరణ దినోత్సవం: మారుతున్న పర్యావరణం వల్ల ముంచుకొస్తున్న ముప్పు ఏంటో తెలుసా?
ప్రతీ ఏడాది జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతారు. పర్యావరణంపై అవగాహన కలిగించడానికి, పర్యావరణం పాడైపోతే కలిగే ఇబ్బందులను తెలియజేయడానికి, పర్యావరణాన్ని రక్షించేందుకు ఎలాంటి కృషి చేయాలో వెల్లడించేందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతారు. 1973నుండి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతున్నారు. కాబట్టి ఈసారి 50వ వార్షికోత్సవం జరుగుతోంది. థీమ్: ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారం అనే థీమ్ తో ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ సంవత్సరం జరిగే వేడుకలకు తూర్పు ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ వేదికయ్యింది. పర్యావరణంలో వస్తున్న మార్పులు ఏంటి? దానివల్ల ఎలాంటి సవాళ్ళు ఎదురుకానున్నాయి మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం.
క్యాన్సర్లను తెచ్చే కాలుష్యం
పెరుగుతున్న వాయు కాలుష్యం: రోడ్డు మీద తిరిగే వాహనాలు, వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీలు మొదలగు వాటివల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ కారణంగా, శ్వాసకోశ సమస్యలు, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల క్యానర్లు వచ్చే అవకాశం ఉంది. పెరుగుతున్న సముద్ర మట్టం: భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం, జనవరి 2020 నుండి 2022 జనవరి వరకు సముద్రమట్టం 10మిల్లీమీటర్లు పెరిగింది. ఇది ఇలాగే పెరిగితే మంచు గడ్డలు కరిగిపోతాయి. భూగర్భంలో నీటి నిల్వలు తగ్గిపోతాయి. వ్యవసాయం ఇబ్బందిగా మారుతుంది.
ప్లాస్టిక్ తో పాడవుతున్న భూమి
ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం: 20సంత్సరాల ప్లాస్టిక్ వినియోగం చాలా తక్కువగా ఉండేది. ఈ 20ఏళ్ళలో విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు వాడిన దానికంటే రెట్టింపు ఇప్పుడు వాడుతున్నారు. దీనివల్ల భూమి కలుషితం అవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు: ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం, గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా భూమి మీద ఉష్ణోగ్రత బాగా పెరిగే అవకాశం ఉందని అంచనా. ఉష్ణోగ్రతలు పెరిగితే మనిషి అల్లాడిపోతాడు. బ్రతకడం కష్టంగా మారుతుంది. ఇంకా అనేక సమస్యలు వస్తాయి.