శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు
శరీరంలో కొవ్వు పేరుకుపోతే అనేక సమస్యలు వస్తుంటాయి. గుండె ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంటుంది. హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. మరి శరీరంలోని కొవ్వును కరిగించాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో చూద్దాం. గింజలు: బాదం, వాల్నట్స్ వంటివి తినడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. చియా గింజలు కూడా మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకున్నా, కొవ్వు కరగాలనుకున్నా ఈ మూడు గింజలను మీ ఆహారంలో చేర్చుకోండి. పండ్లు: యాపిల్స్, బెర్రీ, దానిమ్మ, స్ట్రాబెర్రీ మొదలగు పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం మొదలుపెట్టండి. శరీర కొవ్వు తొందరగా కరిగిపోతుంది.
అధిక కొవ్వును తగ్గించే కూరగాయలు
బ్రోకోలీ, ఆకుకూరలు, టమాట, క్యారెట్ మొదలైన కూరగాయలను తినాలి. బ్రోకోలీ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకల జాయింట్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఓట్ మీల్: కేలరీలు తక్కువగా ఉండే ఓట్ మీల్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులోని ఫైబర్, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపించడంలో సాయపడుతుంది. సాల్మన్ చేప: ప్రోటీన్ అధికంగా ఉండే సాల్మన్ చేపను వెంటనే ఆహారంలో చేర్చుకోండి. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో సాయపడతాయి. గ్రీన్ టీ: మీ పొట్టకొవ్వును తగ్గించడానికి గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను వేగవంతం చేస్తాయి. కాకపోతే ఇందులో కొంత కెఫైన్ ఉంటుంది