వరల్డ్ హైపర్ టెన్షన్ డే 2023: హైబీపీ రావడానికి కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ ఏడాది మే 17వ తేదీన ప్రపంచ అధిక బీపీ దినోత్సవాన్ని జరుపుతారు. హైబీపీ మీద అవగాహన కల్పించడానికి, హైబీపీ వల్ల ఇబ్బందులను తెలుసుకుని, వాటి బారిన పడకుండా ఉండడానికి ఈరోజును జరుపుతారు.
హైబీపీ కారణంగా గుండెపోటు, కిడ్నీ సమస్యలు, రక్తనాళాలు పాడైపోవడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి.
థీమ్:
బీపీని ఖచ్చితంగా చెక్ చేసుకోండి, బీపీని నియంత్రించండి, ఎక్కువ కాలం బతకండి అనే థీమ్ ని ఈసారి ఎంచుకున్నారు. 2005సంవత్సరం నుండి ప్రపంచ హైబీపీ దినోత్సవాన్ని జరుపుతున్నారు.
బీపీ అనేది మీరు రోజువారి చేసే పనుల వల్ల మారుతూ ఉంటుంది. సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయికి బీపీ చేరితే హైబీపీ కలుగుతుంది.
Details
హైబీపీ రావడానికి గల కారణాలు
వయసు రీత్యా హైబీపీ వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఎవరికైనా హైబీపీ ఉంటే వారి పిల్లలకు అధిక రక్తపీడనం ఉండే అవకాశం ఉంది. స్థూలకాయంతో బాధపడే వారిలో హైబీపీ ఏర్పడుతుంది.
ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం, ఉప్పు ఎక్కువగా తీసుకోడం మొదలగు ఆహారపు అలవాట్ల వల్ల బీపీ పెరుగుతుంది.
డయాబెటిస్, మూత్రపిండ వ్యాధులు, నిద్ర సరిగ్గా లేకపోవడం, వ్యాయామాలు చేయకుండా ఉండడం, శరీర కదలికలు ఎక్కువగా లేకపోవడం వల్ల హైబీపీ కలుగుతుంది.
అధిక ఒత్తిడి, పొగ త్రాగడం, ఇంకా కొన్ని రకాల మందులు కూడా హైబీపీకి కారణమవుతాయి. హైబీపీకి ఏవేవి కారణమవుతాయో వాటిపట్ల జాగ్రత్తలు తీసుకుంటే హైబీపీని నివారించగలం.