
భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ చిట్కాలను పాటించండి
ఈ వార్తాకథనం ఏంటి
సమాజంలో ఈ మధ్య కాలంలో భాగస్వాముల మధ్య మనస్పర్థల కారణంగా కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి.
భార్యభర్తల మధ్య బంధం బలపడాలంటే ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. అప్పుడే ఆ దంపతులు సుఖంగా జీవిస్తారు. ఈ రోజుల్లో ప్రేమ బంధం బలపడాలంటే పాటించాల్సిన కొన్ని అలవాట్ల గురించి మనం తెలుసుకుందాం.
భార్యభర్తల మధ్య ప్రేమ కలకాలం ఉండాలంటే ఒకరిపై ఒకరికి ప్రేమ, అడ్జెస్ట్మెంట్స్, నమ్మకం ఉండాలి. రిలేషన్ షిప్ లో అప్పుడప్పుడు గొడవలు జరగడం సర్వసాధారణం.
అయితే ఆ గొడవలు హద్దు దాటితే దాంపత్య జీవితమైనా, ప్రేమ అయినా పునాదితో సహా కూలిపోతుంది.
Details
ఒకరినొకరు అర్ధం చేసుకొని ముందుకెళ్లాలి
దంపతుల మధ్య నమ్మకం అవసరం
ప్రేమ బలంగా ఉండాలంటే దంపతుల మధ్య నమ్మకం అవసరం. నమ్మకం సన్నగిల్లితే గొడవలు జరిగే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్ధం చేసుకొని జీవితంలో ముందుకెళ్లాలి.
అప్పుడే దాంపత్య జీవితం కలకాలం చెక్కు చెదరంగా ఉంటుంది.
అబద్దాలు అడొద్దు
భాగస్వామితో అబద్దాలు అడితే ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగే ఛాన్స్ ఉంది. ఏ విషయాలను భాగ్యస్వామికి తెలియకుండా దాటి పెట్టకూడదు. ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలను షేర్ చేసుకోవాలి.
బంధం దృఢంగా ఉండాలంటే భాగస్వామితో తరుచూ నిజాలు చెబుతూ ఉండాలి. అప్పుడు మీపైన నమ్మకం పెరుగుతుంది. ఇద్దరి మధ్య దూరం పెరిగితే ఒకరితో ఒకరు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి.
Details
ఎక్కువ సమయాన్ని కేటాయించాలి
దంపతులు ఒకరినొకరు మెచ్చుకోవాలి
దంపతులిద్దరూ తరుచూ ఒకరినొకరు ప్రశంసించుకోవాలి. ఏదైనా మంచి పని చేస్తే భాగస్వామిని ప్రశంసలతో ముంచెత్తాలి. భాగస్వామిని అర్ధం చేసుకొని మెచ్చుకుంటే మీపైన విశ్వాసం పెరుగుతుంది.
మీరు వారికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించినప్పుడు, ఆమెకు మీపై నమ్మకం బలపడుతుంది.
దూరాన్ని తగ్గించుకోవాలి
బీజీ సమయంలో దంపతులిద్దరూ ఒకరికొకరు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
కనుక వీలైనంత ఎక్కువ సమయం జీవిత భాగస్వామితో గడపడానికి ప్రయత్నించాలి. ఇద్దరు ఎక్కువ సమయం గడపడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ మరింత ఎక్కువ అవుతుంది.