మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా తినేస్తున్నారా? ఈ టిప్స్ తో తక్కువ తినడం అలవాటు చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఆహారం విషయంలో మీరు కంట్రోల్ కోల్పోతున్నారా? ప్రతీసారి తక్కువ తిందామని ఆలోచించి చివరికి ఎక్కువగా తినేస్తున్నారా? బరువు తగ్గాలనుకుని తక్కువగా తినాలనే ఆలోచన మీకుందా?
ప్రస్తుతం ఆహారం తక్కువ తినాలంటే పాటించాల్సిన కొన్ని టిప్స్ తెలుసుకోండి.
కఠిన నిబంధన పనికిరాదు:
తక్కువగా తినాలని మరీ తక్కువగా తిన్నారనుకోండి. మీ ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎక్కడైనా అతి పనికిరాదని గుర్తుంచుకోండి.
చిన్న ప్లేట్ వాడండి:
భోజనం చేసేటప్పుడు చిన్న ప్లేట్ లో తినడం అలవాటు చేసుకోండి. చిన్న ప్లేట్లో ఆహారం పెట్టుకున్నప్పుడు ఎక్కువగా తిన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మీరు మెంటల్ గా ఎక్కువగా తిన్నట్టు ఫీలవుతారు.
అదే పెద్ద ప్లేట్లో నార్మల్ సైజులో ఆహారాన్ని పెట్టుకున్నా కూడా తక్కువగా తిన్నట్టుగా అనిపిస్తుంది.
Details
వృధాగా పోతుందని కడుపులో వేసుకోకూడదు
కప్స్ వాడండి:
తక్కువగా అంటే ఎంత తినాలనేది చాలామందికి అర్థం కాదు. ఇలాంటప్పుడే కొలతలు గల కప్స్ వాడండి. ఈ పూటకి ఇంత కొలత గల కప్పుతో ఆహారం తీసుకోవాలని అనుకోండి. దానివల్ల మీరు ఎంత తింటున్నారో మీకు అర్థమవుతుంది.
నెమ్మదిగా తినండి:
ఆహారాన్ని నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి. అలాగే ఆహారాన్ని బాగా నమలడం కూడా అలవాటు చేసుకోవాలి. నెమ్మదిగా తినడం వల్ల టైం ఎక్కువగా పడుతుంది. దానివల్ల మీరు ఎక్కువగా తిన్నట్టు ఫీలవుతారు.
ఆహారం వృధా అవుతుందని ఎక్స్ ట్రా తినడం మానేయండి:
మీరు తిన్న తర్వాత కూడా ఇంకా కొంచెం ఆహారం మిగిలిపోతుందని దాన్ని కూడా తినాలని మీరు అనుకోకండి.