
Food: డయాబెటిస్ తో బాధపడేవారు తినకూడని పండ్లు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
డయాబెటిస్ తో బాధపడేవారు తాము తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పండ్లు తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. అన్ని రకాల పండ్లను తినకూడదు.
ప్రస్తుతం డయాబెటిస్ తో బాధపడేవారు ఏయే రకాల పండ్లను తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
లీచి
లీచి పడ్లలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అలాగే వీటి గ్లిసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. లీచి పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం అమాంతం పెరిగిపోతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయి.
సో, డయాబెటిస్ తో బాధపడేవారు లీచి పండ్లకు దూరంగా ఉండడమే మంచిది.
Details
డయాబెటిస్ తో బాధపడేవారు తినకూడని పండ్లు
అరటి పండ్లు:
వీటి గ్లిసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. ఈ కారణంగా రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తినకూడదు. ఒకవేళ మీకు అరటి పండ్లను తినాలనిపిస్తే బాదం, పిస్తా, వాల్ నట్స్ తో పాటు అప్పుడప్పుడు తినాలి.
మామిడి పండ్లు:
వేసవిలో దొరికే మామిడి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ వీటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు ఒకవేళ తినాలనుకుంటే చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి.
పైనాపిల్:
దీనిలో చక్కెర శాతం తో పాటు కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రెగ్యులర్ గా తినకుండా అప్పుడప్పుడు పైనాపిల్ తినవచ్చు.