చలికాలంలో అరటిపండు తింటే అనర్థాలు కలుగుతాయా? నిజం తెలుసుకోండి
సాధారణంగా ఎక్కువ మంది తినే పండు అరటిపండు. ఎందుకంటే చాలా సులభంగా మార్కెట్ లో దొరుకుతుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి. మిగతా పండ్లతో పోల్చితే చవక కూడా. ఇలా ఈజీగా దొరికేవాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ దానిలోని పోషకాల గురించి తెలిసిన వాళ్ళు మాత్రం విడిచిపెట్టరు. ఐతే చలికాలంలో అరటి పండు తినొద్దని ఒక నమ్మకం ఉంది. కానీ అది అపోహా అని పోషకాహార నిపునులు చెబుతున్నారు. చలికాలంలో ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిని నివారించాలంటే రోజువారి ఆహారంలో కాల్షియం ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అరటి పండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఐరన్, ఫోలేట్ ఉంటాయి కాబట్టి శరీర ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
రాత్రిపూట తినొద్దు
అరటి పండులో ఫైబర్ ఉంటుంది. నీళ్లలో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ ఉంటాయి. నీటిలో కరిగే ఫైబర్ ఫైబర్ వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది. దానివల్ల ఆహారం ఎక్కువ తీసుకోకుండా ఉంటారు. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అరటి పండును తినడం మంచిది. రాత్రిపూట అరటి పండు తినకపోవడం ఉత్తమం. ముఖ్యంగా జలుబు, దగ్గు మొదలగు ఇబ్బందులతో బాధపడుతున్నవారు అరటి పండును ముట్టుకోవద్దు. రాత్రిపూట అరటి పండు తింటే అది తొందరగా అరగదు. ఇంకా ఒళ్ళంతా బద్దకంగా అనిపిస్తుంది. ఇందులోని ఫైబర్ కారణంగా గుండెకు మేలు జరుగుతుంది. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అంతేకాదు హృదయ స్పందనలను సరిగ్గా ఉంచి, మెదడును ఉత్తేజపరుస్తుంది.