
ఆహారం: బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల బ్రెయిన్ పవర్ పెరగడంతో పాటు అనేక లాభాలు
ఈ వార్తాకథనం ఏంటి
మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే ఆహారం తప్పనిసరి. అయితే ఆహారం తీసుకోవడంలో చాలామంది తప్పులు చేస్తుంటారు.
కొందరు బ్రేక్ ఫాస్ట్ వదిలేసి మద్యాహ్నం, రాత్రి మాత్రమే భోజనం చేస్తారు. అలాంటి వారు బ్రేక్ ఫాస్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్ వల్ల కలిగే లాభాలు:
రోజును ప్రారంభించడానికి కావాల్సిన శక్తిని బ్రేక్ ఫాస్ట్ అందిస్తుంది. రాత్రి తిన్న తర్వాత ఉదయం వరకు కడుపులో ఏమీ ఉండదు. అందుకే ఉదయాన్నే కడుపులో బ్రేక్ ఫాస్ట్ ని పడేస్తే శరీరానికి శక్తి వస్తుంది.
బరువును నియంత్రణలో ఉంచుతుంది:
శరీర బరువు పెరగకుండా, అదే టైమ్ లో తగ్గకుండా నియంత్రణలో ఉంచుతుంది బ్రేక్ ఫాస్ట్.
Details
రక్తంలో గ్లూకోజ్ ని నియంత్రణలో ఉంచే బ్రేక్ ఫాస్ట్
గ్లూకోజ్ నిల్వల నియంత్రణ:
రక్తంలో గ్లూకోజ్ నిల్వలను నియంత్రణలో ఉంచడంలో బ్రేక్ ఫాస్ట్ సాయపడుతుంది. దానివల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
మెదడు పనితీరు మెరుగు:
పొద్దున్న లేచిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మెదడు కావాల్సిన శక్తి అందుతుంది. అందుకే మెదడు పనిచేసే తీరు పెరుగుతుంది.
రోగాలను రాకుండా చూస్తుంది:
పోషకాల లోపం కారణంగా వచ్చే రోగాలను రాకుండా చూస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఆరోగ్యకరమైన ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అందుకే బ్రేక్ ఫాస్ట్ ని వదిలిపెట్టకూడదు.