
మీ శరీరానికి తొందరగా శక్తిని అందించే ఆహారాలు
ఈ వార్తాకథనం ఏంటి
మనం ఆహారం తీసుకునేది శక్తి గురించే. శరీరంలో శక్తి లేకపోతే ఏ పనీ చేయలేం. కనీసం సరిగ్గా ఆలోచించలేం కూడా. అందుకే ఆహారం పట్ల జాగ్రత్త అవసరం. ప్రస్తుతం శరీరానికి తొందరగా శక్తిని అందించే ఆహారాలేంటో తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్ళు:
ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగడం మర్చిపోకండి. బయట తిరిగేటప్పుడు మీ దగ్గర కొబ్బరి నీళ్ళ బాటిల్ ఉంచుకుంటే మరీ మంచిది.
కొబ్బరి నీళ్ళలో పొటాషియం, పాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు ఉంటాయి. వీటి కారణంగా తక్షణమే మీకు ఎనర్జీ వస్తుంది.
అరటిపండు: అరటి పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తాయని వాటిని తేలికగా తీసిపారేస్తారు. కానీ అరటిపండు వల్ల మీకు తొందరగా ఎనర్జీ వస్తుంది.
Details
తొందరగా శక్తిని అందించే ఆహారాలు
స్వీట్ పొటాటో:
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల తొందరగా శక్తి రావడంతో పాటు కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి తొందరగా ఆకలి వేయదు.
పుదీనా నీళ్ళు:
మీలో తొందరగా శక్తి రావడానికి పుదీనా నీళ్ళు కూడా బాగా పనిచేస్తాయి. ఎప్పుడైనా అలసటగా అనిపించినపుడు పుదీనా నీళ్ళు ట్రై చేయండి.
గుడ్లు:
గుడ్లు మిమ్మల్ని ఎప్పుడూ నీరసంగా మార్చలేవు. ఇందులో ప్రోటీన్ తో పాటు విటమిన్ బి ఉంటుంది. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
నారింజ:
నారింజ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీర కణాలను రిపేర్ చేయడానికి విటమిన్ సి బాగా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం ఉంటుంది కాబట్టి మీకు తొందరగా ఎనర్జీ వస్తుంది.