రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఆహారాలు మీ డైట్ లో ఉన్నాయా?
ఈ వార్తాకథనం ఏంటి
జనవరి మాసం వచ్చేస్తోంది. చలిమంటలు భోగి మంటలుగా మారబోతున్నాయి. ఈ సమయంలో మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు మనల్ని ఇబ్బందిపెట్టకుండా కొన్ని ఆహారాలు కాపాడతాయి.
మొక్కజొన్న రొట్టె, క్యారెట్ హల్వా, దుంపలు మొదలగునవి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి, అనవసర రోగల బారిన పడకుండా కాపాడతాయి.
మొక్కజొన్న రొట్టె: మొక్కజొన్న రొట్టెలు చేసుకుని అల్లం, వెల్లుల్లి, ఆవాలతో కలిపి చేసిన కూరలో నంజుకుని ఆరగిస్తే ఆహ్లాదంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి, కె వల్ల గుండె సంబంధ వ్యాధులు దరిచేరవు.
డ్రై ఫ్రూట్స్: బాదం, కాజు, వాల్ నట్స్ వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. అలాగే శరీరం వెచ్చగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి
పల్లీపట్టి, ఉసిరి, దుంపలు
బెల్లంతో తయారయ్యే పల్లీపట్టీల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సెలేనియం, జింక్ అనే ఖనిజాలు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. రోజువారి ఆహారంలో దీన్ని చేర్చుకుంటే బాగుంటుంది.
విటమిన్ సి అధికంగా లభించే ఉసిరి వల్ల అనేక రోగాలు శరీరాన్ని చేరకుండా ఉంటాయి. ఉసిరి పచ్చడి లేదా మురబ్బా తయారు చేసుకుని తినండి.
దుంపలు: ప్రకృతి మనకు ప్రసాదించే స్వీట్ పొటాటో, బీట్ రూట్, క్యారెట్ వంటి వాటిల్లో పోషకాలు అపరిమితంగా ఉంటాయి. విటమిన్ ఏ, బీ, ఫబర్, పొటాషియం, బీటా కెరాటిన్, మాంగనీస్ సమృద్ధిగా లభిస్తాయి.
క్యారెట్ తో హల్వా చేసుకుని హ్యాపీగా తినొచ్చు. బీట్ రూట్ జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది. స్వీట్ పొటాటోని ఉడకబెట్టుకుని తింటే రుచిగా ఉంటుంది.