vegetables in winter: శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు ఇవే..!
ఈ వార్తాకథనం ఏంటి
చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు ఆహారపు అలవాట్ల విషయంలో మరింత శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. శీతాకాలం మొదలయ్యాక జలుబు, దగ్గు, అలర్జీ వంటి ఇబ్బందులు పెరిగే పరిస్థితుల్లో, ప్రతిరోజూ తీసుకునే కూరగాయల ఎంపికపైనా జాగ్రత్తలు అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో కొన్ని కూరగాయలు శరీరాన్ని మరింత చల్లబరచి ఆరోగ్య సమస్యలను తీవ్రం చేసే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఏ కూరలను తగ్గించాలి?ఏవైతే తప్పనిసరిగా మెనూలో ఉండాలో వివరించారు. ముఖ్యంగా శరీరంలో చలి,దగ్గు,జలుబు, అలర్జీలను వేగంగా పెంచే కొన్ని కూరగాయలను ఈ సీజన్‌లో తగ్గించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల వివరణ ప్రకారం.. చలికాలంలో వంకాయ, బీరకాయ, సొరకాయ, దోసకాయ వంటి కూరగాయలు సహజంగా శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి.
వివరాలు
కిడ్నీ సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ కూరలను పరిమిత మోతాదులో తీసుకోవాలి
అందువల్ల ఇవి జలుబు,దగ్గు సమస్యలను పెంచే అవకాశముందని వారు సూచిస్తున్నారు. ఇదే సమయంలో,బెండకాయ మ్యూకస్ ఉత్పత్తిని పెంచుతుందని,ఇప్పటికే జలుబు లేదా గొంతు సమస్యలతో బాధపడుతున్నవారు దీన్ని తగ్గించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే గుమ్మడికాయ వంటి పదార్థాలు చలికాలంలో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతాయని వారు వివరించారు. కిడ్నీ సమస్యలు ఉన్న వ్యక్తులు గంగవాలి వంటి కూరలను కూడా పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు,చలికాలంలో శరీరానికి వేడిమిని అందించే క్యారెట్,బీట్‌రూట్, ముల్లంగి,మెంతికూర,వాము కూరతో పాటు అల్లం,వెల్లుల్లి వంటి పదార్థాలను ఆహారంలో చేర్చితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అన్నారు. సీజన్ మార్పుల సమయంలో ఆహార ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుందని వైద్యులు సూచించారు.