చలికాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు
చలి పెరుగుతున్న కొద్దీ గుండె మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తగ్గిన కొద్దీ రక్తప్రవాహంలో మార్పులు వస్తాయి కాబట్టి గుండెకు ఎక్కువ పని పడుతుంది. అందుకే చలి నుండి మనల్ని మనం రక్షించుకుంటూ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికోసం గుండె పనితీరును మెరుగుపరిచే ఆహారాలను తీసుకోవాలి. ఓట్ మీల్: ఓట్స్ అంటే చాలామందికి నచ్చదు. కానీ ఓట్స్ లో గుండెకు కావాల్సిన మంచి పోషకాలు ఉంటాయి. జింక్, ఫైబర్ ఉండడం వల్ల చలిప్రభావం గుండె మీద పడకుండా ఉంటుంది. పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ని భాగం చేసుకుంటే బాగుంటుంది. తేలికగా జీర్ణం అవుతుంది కాబట్టి రోజంతా ఎంచక్కా పని చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మరిన్ని ఆహారాలు
సిట్రస్ ఫలాలు: విటమిన్ సి ఎక్కువగా లభించే నారింజ, నిమ్మ, టమాట, ఉసిరి మొదలగు వాటిని సిట్రల్ ఫలాలు అంటారు. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే సజ్జలు, మొక్కజొన్న, రాగులు మొదలగు వాటితో తయారయ్యే ఆహారాలను రోజువారి డైట్ లో చేర్చుకోవాలి. వీటివల్ల గుండెకు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు. మైదాను అస్సలు ముట్టుకోకపోవడం చాలా ఉత్తమం. అలాగే దుంపకూరలు ఎక్కువగా తినాలి. క్యారెట్, బంగాళదుంపలు, స్వీట్ పొటాటో ఇంకా బీట్ రూట్ లను తీసుకోవాలి. వీటిల్లో ఉండే ఏ, బీ, సి విటమిన్లు శరీరానికి, గుండె రక్తనాళాలను మంచి మేలు చేస్తాయి. అలాగే యాంటీ యాక్సిడెంట్లు శరీరంలోని మలినాలను బయటకు పంపివేస్తాయి.