Body Heat Reduce Tips : ఎండ వేడిని మర్చిపోవాలా? ఒంట్లో వేడిని తగ్గించే సింపుల్ చిట్కాలు!
ఈ వార్తాకథనం ఏంటి
సమ్మర్ అప్పుడే మొదలైపోయింది. ఈ కాలంలో ఏ పనీ చేయకపోయినా చెమటలు కారిపోతూ ఉంటాయి, ఒంటంతా వేడిగా అనిపిస్తుంది.
ఉక్కపోతగా ఉండటంతో ఏ పనీ సరిగ్గా చేసుకోలేం. కేవలం స్నానం చేసినప్పుడే కాస్త తేలికగా అనిపిస్తుంది. శరీరం లోపల నుంచి కూడా వేడెక్కడంతో అసౌకర్యంగా ఉంటుంది.
ఈ సమస్యలను తగ్గించుకునేందుకు, బాడీని చల్లగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది.
1. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి
తగినన్ని ద్రవపదార్థాలు తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
నీరు, ఐస్ టీ, మజ్జిగ,అంబలి వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం వేడి నుంచి ఉపశమనం పొందుతుంది.
నీటి లోపం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి.కాబట్టి రోజూ ఎక్కువగా నీరు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి
Details
2. ఐస్ అప్లై చేయడం
ఐస్ క్యూబ్స్ లేదా చల్లని నీటిని ముంజేయ్, మెడ, నుదురు, ఛాతీ భాగాల్లో అప్లై చేయడం వల్ల శరీరం వేడిని తగ్గించుకోవచ్చు.
ఇది బాడీ టెంపరేచర్‌ను కంట్రోల్ చేసి, తేలికగా అనిపించేలా చేస్తుంది. అయితే ఎండలో బయటికి వెళ్లిన వెంటనే ఇలా చేయడం మంచిది కాదు.
3. హెవీ ఎక్సర్‌సైజ్‌లకు బ్రేక్
మరీ ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేస్తే బాడీ వేడెక్కి, అధికంగా చెమటలు పడతాయి. కాబట్టి తక్కువ స్థాయిలో వ్యాయామం చేయడం మంచిది.
ఉదయం లేదా సాయంత్రం వాకింగ్, యోగా చేయడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉండి, వేడి తక్కువగా అనిపిస్తుంది.
Details
4. చల్లని నీటిలో ఉండడం
స్విమ్మింగ్ చేయడం లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది.
నీటిలో ఎక్కువ సమయం గడిపితే మానసిక, శారీరకంగా హాయిగా అనిపిస్తుంది.
5. పలుచని బట్టలు ధరించడం
కాటన్, లినెన్ వంటి సహజ ఫ్యాబ్రిక్స్ వేసుకోవడం వల్ల వేడిని తగ్గించుకోవచ్చు. సింథటిక్ ఫ్యాబ్రిక్స్ (నైలాన్, ఆక్రిలిక్) వేసుకుంటే శరీరం తడిగా మారి మరింత అసౌకర్యంగా అనిపిస్తుంది.
కాబట్టి వీలైనంతవరకు పలుచని, విరివిగా ఉండే బట్టలు ధరించడం మంచిది.
ఈ చిట్కాలను పాటిస్తే, ఎండ వేడి వల్ల కలిగే అసౌకర్యాలను తగ్గించుకోవచ్చు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా సమ్మర్‌ను ఎంజాయ్ చేయవచ్చు!