LOADING...
Motivation: స్నేహితులే కొంప ముంచుతారు.. నకిలీ స్నేహితుని గుర్తించే సీక్రెట్ ఇవే! 
స్నేహితులే కొంప ముంచుతారు.. నకిలీ స్నేహితుని గుర్తించే సీక్రెట్ ఇవే!

Motivation: స్నేహితులే కొంప ముంచుతారు.. నకిలీ స్నేహితుని గుర్తించే సీక్రెట్ ఇవే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2025
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన జీవితంలో చాలా మంది మన వెనుకే ఉండి, మన వెన్నుపోటుగా వ్యవహరిస్తారు. అందుకే ఎవరినీ తక్షణం నమ్మకూడదు. మన స్నేహితుల్లో ఎవరు నిజమైనవారో, ఎవరు శత్రువులుగానో తెలుసుకోవడం ఎంతో అవసరం. లేకపోతే అటువంటి వ్యక్తుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో శతాబ్దాల క్రితం ఆచార్య చాణక్యుడు తన రత్నవధాన విధానాల్లో కొన్ని కీలక సూత్రాలను చెప్పారు, ఇవి నేటికీ అత్యంత ప్రామాణికంగా ఉన్నాయి. జీవితంలో మనకు స్నేహితులు, శత్రువులు ఇద్దరూ ఉంటారు. అయితే నిజమైనవారిని, కపట స్వభావం కలిగినవారిని గుర్తించడం చాల కష్టమే.

Details

మోసపూరిత స్నేహితుడిని గుర్తించవచ్చు

చాణక్యుడి విధానాలను అనుసరించి, మనిషి స్వభావం, ప్రవర్తనను గమనించడం ద్వారా మనం ఒక వ్యక్తి నిజమైన స్నేహితుడో లేదా మోసపూరిత శత్రువో గుర్తించవచ్చు. కొంతమంది మన ముందు స్నేహితుల్లా ప్రవర్తిస్తారు, కానీ వారి హృదయంలో అసూయ, ద్వేషం, శత్రుత్వం దాగి ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు మన విజయాన్ని చూడలేరు. మనం చిన్న కష్టంలో పడితే సంతోషిస్తారు. అవకాశం దొరకగానే, ఎలాంటి తడబాటు లేకుండా, మనను మోసం చేయడంలో కూడా వెనుకాడరు. చాణక్యుడు సూచించినట్లు, అలాంటి కపట వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిలోని నిజమైన స్వభావం వారి మాటలు, ప్రవర్తనలోనే ప్రతిబింబిస్తుంది. మన ముందు పొగిడే, మన వెనుక విమర్శించే వ్యక్తిని ఎప్పుడూ విశ్వసించరాదు.

Details

స్వార్థం లేకుండా సాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు

ఇలాంటి వారు మన బలాన్ని అర్థం చేసుకోవడానికి దగ్గరవుతారు, తరువాత మన బలహీనతలను తెలుసుకుని మనకు నష్టం కలిగిస్తారు. కష్ట సమయాల్లోనే నిజమైన స్నేహితుడు, శత్రువుల మధ్య తేడా స్పష్టమవుతుంది. మనకు స్వార్థం లేకుండా సహాయం చేసే వ్యక్తి నిజమైన స్నేహితుడు. తన స్వార్థం కోసం మాత్రమే మనతో ఉన్నవాడు, కష్టం వచ్చినపుడు పట్టించుకోనివాడు నిజమైన శత్రువు. మన సంతోషంలో ఎవరో ముందుకు రావడం సహజం. కానీ మన దుఃఖంలో, కష్టంలో మన వెంట నిలబడే వ్యక్తే నిజమైన స్నేహితుడు. కష్టసమయాల్లో మాత్రమే కాకుండా, జీవిత సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడే వ్యక్తిని స్నేహితుడుగా ఎంచుకోవాలి. అలాంటి స్నేహం మన బలోపేతానికి, వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుంది. అందువల్ల, నిజమైన స్నేహాన్ని ఎల్లప్పుడూ గౌరవించాలి.