Happy Friendship Day: ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వారం రోజుల పాటు గ్లాన్స్ అందిస్తున్న సరికొత్త సంతోషాలివే
ఈ వార్తాకథనం ఏంటి
నీతో పాటు విరగబడి నవ్వేవాళ్ళు, నీ బాధలను పంచుకునేవాళ్ళు, అర్థరాత్రి మూడు గంటలకు కాల్ చేసినా చిరాకు పడనివాళ్ళు, నిన్ను నిన్నుగా చూసే వాళ్ళు నీకు స్నేహితులుగా ఉంటే జీవితంలో అంతకన్నా అదృష్టం ఉండదు.
అలాంటి స్నేహాన్ని దూరాలు, కాలాలు వేరు చేయలేవు. ప్రతీ దానికీ ఎక్స్ పైరీ ఉంటుంది. ఒక్క స్నేహానికి తప్ప. మనతో రక్తసంబంధం లేకుండా కలిసిన ఒకబంధం, మనలో రక్తం చచ్చేదాకా తోడుగా ఉంటుంది.
ప్రస్తుతం ఫ్రెండ్ షిప్ డే వచ్చేస్తోంది. ఈ సందర్భంగా ఫ్రెండ్ షిప్ డే ని ఎలా జరుపుకోవాలో చూద్దాం.
Details
ఫ్రెండ్ షిప్ డే రోజున మీ స్నేహితులు సర్పైజ్ చేయడానికి రెడీగా ఉండండి
ఈ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన ఫ్రెండ్ షిప్ డే ని జరుపుకుంటున్నాం. ఆల్రెడీ తమ స్నేహితులను సర్పైజ్ చేయడానికి అందరూ రెడీ ఐపోయారు.
ఐతే మీ ఆలోచనల్లో ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కట్టడం వంటి ఆలోచనలు ఉంటే పక్కన పెట్టేయండి. కొత్తగా ఆలోచించండి.
మీ ఆలోచనలకు మరింత సాయం చేయడానికి న్యూస్ బైట్స్ సహకారంతో సరికొత్త ఐడియాలను మీ ముందుకు గ్లాన్స్ తీసుకొస్తుంది. ఈ ఐడియాస్ తో మీరు ఫ్రెండ్ షిప్ డే ని ఎప్పటికీ మర్చిపోలేరు.
Details
ఏడు రోజుల పాటు ఏడు రకాలుగా ఫ్రెండ్ షిప్ డే ని జరుపుకునే విధానాలు
జులై 28వ తేదీ నుండి ఆగస్టు 6వ తేదీ వరకు ఫ్రెండ్ షిప్ డే ని ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలనేది న్యూస్ బైట్స్, గ్లాన్స్ సంయుక్తంగా మీకు తెలియజేయనున్నాయి.
ఆల్రెడీ మీ మనసులో ఎటైనా ట్రిప్ వెళ్ళాలన్న ఆలోచన ఉంటే, ఎటు వెళ్ళాలో మేము మీకు తెలియజేస్తాము. ఎన్నో రోజులుగా కలవలేకపోయినా మీ ఫ్రెండ్స్ ని కలుసుకునేందుకు ఐడియాలు అందిస్తాము.
కమ్యూనికేషన్ కూడా లేని మీ పాత స్నేహితుడిని ఎలా కలుసుకోవాలో మీకు తెలియజేస్తాము.
Details
గ్లాన్స్, న్యూస్ బైట్స్ అందించనున్న ఈ ఫ్రెండ్లీ గైడ్ నుండి ఇంకా ఏమేం తెలుసుకుంటారంటే?
మీ స్నేహితులకు ప్రత్యేకంగా అందివ్వాల్సిన బహుమతులు, మీ స్నేహితులతో చేయాల్సిన సాహసాలు, చరిత్రలోని గొప్ప గొప్ప స్నేహితులకు సంబంధించిన కథలు, వయసు పెరుగుతున్న కొద్దీ స్నేహంలో వచ్చే మార్పులు మొదలగు అంశాలను ఇక్కడ చర్చిస్తాము.
Details
గ్లాన్స్ గురించి
2019లో మొదలైన గ్లాన్స్, రోపోసో, నోస్ట్రా మొదలగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లను నిర్వహించే టెక్నాలజీగా దూసుకుపోతుంది.
లాక్ స్క్రీన్ ద్వారా ఇంటర్నెట్ ని ఉపయోగించుకుని యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని తగ్గించింది. ప్రస్తుతం దాదాపు 400మియన్ల స్మార్ట్ ఫోన్లలో గ్లాన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
InMobi గ్రూప్ అనుబంధ సంస్థ అయిన గ్లాన్స్ ప్రధాన కార్యాలయం సింగపూర్ లో ఉంది.
దీనికి జియో ఫ్లాట్ ఫామ్, గూగుల్, Mithril Capital సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయి.
గ్లాన్స్ గురించి మరింత సమాచారం కావాలంటే glance.com, roposo.com, inmobi.comని సందర్శించండి
Details
గ్లాన్స్ గురించి అదనపు సమాచారం
మీకు ఆసక్తికలిగిన అంశాల్లో కావాల్సిన సమాచారాన్ని అందించడమే గ్లాన్స్ లక్ష్యం.
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే ఈ మొబైల్ యాప్, మీ ఫోన్ తాలూకు లాక్ స్క్రీన్ ద్వారా మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది.
లైవ్ ఎంటర్ టైన్మెంట్, వార్తలు, క్రీడలు, ఇంకా ఎలాంటి సమాచారం కావాలన్నా మీ ఫోన్ లాక్ స్క్రీన్ లో దొరుకుతుంది.
Details
న్యూస్ బైట్స్ విశేషాలు
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వివిధ భాషల్లో కంటెంట్ ని సృష్టిస్తూ భారతదేశంలో అగ్రగామి మీడియా సంస్థగా న్యూస్ బైట్స్ ఎదుగుతోంది.
వివిధ రకాల ఫార్మాట్లలో మానవ ప్రమేయం ఎక్కువగా లేకుండానే అత్యంత నాణ్యమైన కంటెంట్ ని న్యూస్ బైట్స్ అందిస్తోంది.