
Friendship Day: భారత ఇతిహాసాల్లో చెప్పుకోదగిన గొప్ప స్నేహాలు
ఈ వార్తాకథనం ఏంటి
స్నేహ బంధం రక్తసంబంధం కన్నా గొప్పది. అన్నా, తమ్ముడు చెల్లెలు, అక్కలతో పంచుకోని విషయాలు కూడా స్నేహితులతో చెప్పుకుంటారు.
ఈ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత ఇతిహాసాల్లోని గొప్ప స్నేహాల గురించి తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడు, కుచేలుడు:
వీరిద్దరూ సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసారు. విద్యాభ్యాసం పూర్తయిన కొన్నేళ్ళ తర్వాత కుచేలుడికి కష్టాలు మొదలవుతాయి. ఆ సమయంలో కృష్ణుడిని కలవడానికి ద్వారకా వెళతాడు కుచేలుడు. అక్కడ రాజభవనంలోకి కుచేలుడిని భటులు అనుమతించరు.
అది చూసిన కృష్ణుడు, పరుగెత్తుకుంటూ కుచేలుడి దగ్గరకు వచ్చి సాదరంగా రాజభవనంలోకి ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత కుచేలుడు తీసుకొచ్చిన అటుకులను కృష్ణుడు తింటాడు. అలా శ్రీకృష్ణుడు, కుచేలుడితో తన స్నేహబంధాన్ని చాటుకున్నాడు.
Details
స్నేహానికి కులాలు లేవని చాటి చెప్పే పురాణ గాథలు
రాముడు, సుగ్రీవుడు:
సీత జాడ కోసం రాముడు వెతుకుతుండగా హనుమంతుడు సుగ్రీవుడిని రాముడికి పరిచయం చేస్తాడు. కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగించడంలో రాముడు సుగ్రీవుడికి సాయం చేస్తాడు.
అలాగే సీత జాడ కనిపెట్టడంలో రాముడికి సుగ్రీవుడు సాయం చేస్తాడు.
కర్ణుడు, ధుర్యోధనుడు:
సూర్యుడి అంశ కారణంగా కుంతి కడుపున జన్మించిన కర్ణుడు, శూద్రుల వద్ద పెరుగుతాడు. కర్ణుడికి రాజ్యం లేదన్న కారణంగా విలువిద్య పోటీల్లో అర్హత లేదని సభాముఖంగా అవమానం జరగడంతో, అప్పటికప్పుడు అంగరాజ్యానికి కర్ణుడిని రాజుగా చేస్తాడు ధుర్యోధనుడు.
పాండవులతో యుద్ధంలో ధుర్యోధనుడికి కర్ణుడు సాయం చేస్తాడు. ఇలా వీరిద్దరి మైత్రి చెప్పుకోదగినదిగా మారింది.
Details
శ్రీకృష్ణుడు, అర్జునుడు
వరుసకు బావ బావమరిది అయినా కూడా వీరిద్దరి మధ్య మైత్రి బంధం ఎక్కువగా కనిపిస్తుంది. రథసారథిగా కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని కృష్ణుడు ముందుకు ఉరికించాడు.
అలాగే యుద్ధం చేయలేనని అర్జునుడు వైరాగ్యంతో బాధపడితే భగవద్గీత బోధించి యుద్ధం ఎందుకు చేయాలో కృష్ణుడు తెలియజేసాడు.