
ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టాలనుకుంటున్నారా? ఏ రంగు బ్యాండ్ కడితే ఎలాంటి అర్థం వస్తుందో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
స్నేహితుల దినోత్సవం వచ్చేస్తోంది. ప్రతీ సంవత్సరం భారతదేశంలో ఆగస్టు మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఈ క్రమంలో ఈ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన ఫ్రెండ్ షిప్ డేని జరుపుకుంటున్నారు.
ఫ్రెండ్ షిప్ డే అనగానే అందరికీ గుర్తొచ్చేవి ఫ్రెండ్ షిప్ డే బ్యాండ్స్. తమకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే స్నేహితులకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కడుతుంటారు.
ఈ అలవాటు మీకు కూడా ఉంటే ఈ స్నేహితుల కోసం మంచి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కొనండి. అయితే కొనే ముందు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ రంగులకు అర్థాలు తెలుసుకోండి.
రంగుకున్న అర్థాన్ని బట్టి మీ స్నేహితులకు ఫ్రెంఢ్ షిప్ బ్యాండ్ కట్టండి.
Details
రంగులు, వాటిలోని అర్థాలు
పసుపు:
ఈ రంగు స్నేహానికి గుర్తు. అవతలి వారు చూపించే స్నేహానికి గుర్తుగా మీరు దీన్ని కట్టవచ్చు.
గులాబీ:
మిమ్మల్ని బాగా అర్థం చేసుకునేవారు,. మీపై ఎక్కువ ఇష్టం చూపేవారికి ఈ రంగు బ్యాండ్ కట్టండి.
తెలుపు:
ఈ రంగు స్వఛ్ఛతకు చిహ్నం. మీతో స్నేహంలో ఎవరైతే స్వఛ్ఛంగా, నిర్మలంగా ఉంటారో అలాంటి వారికి రంగు బ్యాండ్ కట్టండి.
ఎరుపు:
ఈ రంగు, ప్రేమను, భావుకత్వాన్ని చూపిస్తుంది. మీతో ప్రేమగా ఉండే దగ్గరివాళ్ళకు ఈ రంగు బ్యాండ్ ని కట్టండి.
ఆకుపచ్చ:
మీతో అత్యంత నమ్మకంగా ఉండేవారికి ఈ రంగు బ్యాండ్ కట్టాలి.