
మీ జీవితం హ్యాపీగా సాగాలంటే ఎలాంటి వారితో స్నేహం చేయాలో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల అని ఒక పాట ఉంటుంది. అది వందశాతం నిజం. మీ స్నేహితులు మంచివారైతే మీరు జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు.
అయితే ఎలాంటి వారు మీ స్నేహితులైతే మీరు హ్యాపీగా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.
మీరెలా ఉన్నారో అలా మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు:
మిమ్మల్ని జడ్జ్ చేయని వారు మీ ఫ్రెండ్స్ అయితే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు. మీలోని లోపాలను అర్థం చేసుకుని మీతో స్నేహం చేసే వాళ్ళుమీ చుట్టుపక్కల ఉంటే మీరు సంతోషంగా ఉండగలుగుతారు.
అవసరంలో అందుబాటులో ఉండే స్నేహితులు:
మీ భావాలు చెప్పుకోవడానికైనా, మీ సమస్యను పంచుకోవడానికైనా స్నేహితులు అందుబాటులో ఉంటే బాగుంటుంది.
Details
నిజాయితీ నిండిన స్నేహితులే మీ అభివృద్ధిని కోరుకుంటారు
ప్రతీరోజూ కనెక్షన్ లేకపోయినా కలిసుండే స్నేహితులు:
రోజూ ఫోన్ చేసుకోలేకపోయినా, వారాల తరబడి కలుసుకోక పోయినా, కలిసినప్పుడు మాత్రం మీరు కలిసున్న రోజుల్లో ఎంత స్నేహంగా ఉండేవారో అంతటి స్నేహాన్ని చూపించే స్నేహితులు ఉండాలి.
సద్విమర్శను పంచుకునే స్నేహితులు:
మీరు చేసిన పనులు మంచివో కాదో మిమ్మల్ని నొప్పించకుండా తెలియజేసే స్నేహితుడు ఉండాలి. తమ స్పందనను నిజాయితీగా తెలియజేసే వాళ్ళు స్నేహితులుగా ఉంటే మీరు చేస్తున్న పనిలో ఎదుగుతారు.
మీరు ఎదగాలని కోరుకునే స్నేహితులు:
మీ ఎదుగుదలను కోరుకునే స్నేహితులు మీ చుట్టుపక్కల ఉండే మీరెప్పటికీ హ్యాపీగా ఉంటారు. స్వార్థం లేకుండా మరొకరి ఎదుగుదలను కోరుకునే స్నేహితులు ఉంటే లైఫ్ బాగుంటుంది.