LOADING...
#SankranthiSpecial: భోగి నుంచి కనుమ వరకు.. పండుగలో తప్పక చేయాల్సిన 10 పనులు ఇవే!
భోగి నుంచి కనుమ వరకు.. పండుగలో తప్పక చేయాల్సిన 10 పనులు ఇవే!

#SankranthiSpecial: భోగి నుంచి కనుమ వరకు.. పండుగలో తప్పక చేయాల్సిన 10 పనులు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనం సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే కొత్త బట్టలు, రుచికరమైన పిండి వంటలు, ఆటపాటలు, సందడి సరదాలే గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ వాస్తవానికి సంక్రాంతి పర్వదినాలు ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమగా వచ్చే ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా చేయాల్సిన 10 విధులు ఉన్నాయి. ఈ విధులను నిష్ఠగా పాటిస్తే పండుగ వేళ అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

Details

భోగి రోజు చేయాల్సిన విధులు

1. భోగి పీడను వదిలించుకోవడం భోగి రోజున ప్రధానంగా చేయాల్సిన మొదటి పని పీడ నివారణ. దీనికి మూడు మార్గాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భోగి పండుగ రోజు ఉదయాన్నే తలంటుకుని భోగి నీళ్లతో స్నానం చేయాలి. ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయాలి. ఇంటికి పట్టిన దోషాలు తొలగాలంటే భోగి మంట వేయాలి. ఈ భోగి మంట సామాన్యమైన మంట కాదు, అది అగ్నిహోత్రానికి సమానం. పూజను సామాన్యుల ముంగిటకు తీసుకువచ్చిన సంప్రదాయమే భోగి మంట అని చెప్పబడుతుంది.

Details

2. గోదా కళ్యాణంలో పాల్గొనడం

భోగి రోజు దక్షిణాయనానికి, ధనుర్మాసానికి చివరి రోజు. ఈ పవిత్రమైన రోజున సమీపంలోని దేవాలయానికి వెళ్లి గోదా కళ్యాణంలో పాల్గొనడం ఎంతో శుభప్రదమని చెబుతారు. 3. నువ్వులతో చేసిన ఆహారం తీసుకోవడం, పంచడం ఈ మూడు రోజుల పండుగల్లో నువ్వులకు సంబంధించిన ఆహారం తప్పకుండా తినాలని శాస్త్రం చెబుతోంది. అందుకే నువ్వుల చిమిలి తయారు చేసి తినాలి. అలాగే కొంతమందికి పంచి పెట్టాలి. పండుగ సమయంలో నువ్వులు ఇవ్వడం, తీసుకోవడం రెండూ శుభకరమే.

Advertisement

Details

 4. ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టడం 

పండుగ రోజుల్లో ఇంటి ముంగిట ముగ్గులు పెట్టడం, అందులో గొబ్బెమ్మలు ఉంచడం చాలా శుభసూచకం. ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ భూమాతకు ప్రతీక. శ్రీసూక్తంలో 'నిత్య పుష్టాం కరీషిణీం' అనే మంత్రం ఉంది. ఇందులో కరీషం అంటే ఆవు పేడ. అందుకే ముగ్గుల్లో గొబ్బెమ్మ తప్పనిసరిగా పెట్టాలని శాస్త్రోక్తి. మకర సంక్రాంతి రోజు చేయాల్సిన పనులు ఈ మూడురోజుల పండుగల్లో అత్యంత ముఖ్యమైనది మకర సంక్రాంతి . ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మనుషుల ఒక సంవత్సరం కాలాన్ని దేవతలకు ఒక రోజుగా పరిగణిస్తారు. ఆ దేవతల దినానికి ఉదయ సమయం లాంటిదే ఉత్తరాయణ పుణ్యకాలం. అదే సంక్రాంతి రోజు. ఈ రోజున చేయాల్సిన ముఖ్యమైన 4 విధులు ఉన్నాయి.

Advertisement

Details

5. నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం 

మకర రాశికి అధిపతి శని. అలాగే పుష్య మాసాన్ని కూడా శని మాసంగా పిలుస్తారు. అందుకే మకర సంక్రాంతి రోజు నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయడం అత్యంత శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. 6. శివుడికి రుద్రాభిషేకం మకర సంక్రాంతి రోజున శివుడికి రుద్రాభిషేకం చేయడం చాలా ముఖ్యమైన విధి. ఇంట్లో చిన్న శివలింగాన్ని తీసుకుని, కొద్దిగా పేరిన నెయ్యిని శివలింగం పైభాగంలో ఉంచాలి. ఆ తర్వాత చల్లారిన పలుచటి నెయ్యితో అభిషేకం చేస్తూ శివ మంత్రాలు పఠించాలి. ఇలా చేస్తే ఏ జన్మలోనూ దారిద్ర్యం రాదని శాస్త్రవచనం.

Details

7. పితృదేవతలకు తర్పణం లేదా శ్రాద్ధం 

ఈ రోజున తప్పనిసరిగా పితృదేవతలకు సంబంధించిన కార్యం చేయాలి. తర్పణం వదలడం, శ్రాద్ధం పెట్టడం వంటివి చేయాలి. పితృదేవతలు తృప్తి చెందితే కుటుంబంలో సుఖసంతోషాలు నిలుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 8. పెరుగు దానం మకర సంక్రాంతి రోజు పెరుగు దానం చేయడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల సంతాన క్షేమం, సంపద, ఆయుష్షు కలుగుతాయని శాస్త్రోక్తి.

Details

 కనుమ పండుగ రోజు చేయాల్సిన విధులు

9. గోవులకు, పశువులకు పూజ కనుమ పండుగ పశుసంపదను ఆరాధించే రోజు. నగరాల్లో ఉన్నవారు దగ్గర్లోని గోశాలకు వెళ్లి గోవులకు ఆహారం పెట్టడం ఎంతో శుభప్రదం. అది సాధ్యం కాకపోతే ఇంట్లో గోపూజ చేయడం మంచిది. 10. మినుములతో చేసిన ఆహారం తినడం కనుమ పండుగ రోజున తప్పనిసరిగా మినుములు తినాలని శాస్త్రాల్లో పేర్కొనబడింది. అందుకే మినుములతో చేసిన గారెలు వంటి వంటకాలు తీసుకోవాలి.

Advertisement