LOADING...
Christmas 2026 : శాంతా నుంచి వైన్ వరకు.. క్రిస్మస్ ఆచారాల్లో దాగిన పది ఇంట్రెస్టింగ్ విషయాలివే!
శాంతా నుంచి వైన్ వరకు.. క్రిస్మస్ ఆచారాల్లో దాగిన పది ఇంట్రెస్టింగ్ విషయాలివే!

Christmas 2026 : శాంతా నుంచి వైన్ వరకు.. క్రిస్మస్ ఆచారాల్లో దాగిన పది ఇంట్రెస్టింగ్ విషయాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రిస్మస్‌ పండుగను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ పండుగకు ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, ఇతిహాసాలు దాని వైశిష్ట్యాన్ని మరింత పెంచుతాయి. ప్రతి పండుగకు దాని సొంత చరిత్ర, ఆచారాల సమాహారం ఉన్నట్టే, క్రిస్మస్‌కూ ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. క్రైస్తవ పండుగలలో అత్యంత ప్రధానమైనదిగా నిలిచిన క్రిస్మస్‌ను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు జరుపుకుంటున్నారు. అందుకే ఈ పండుగకు సంబంధించిన ఆచారాలు కూడా ఎంతో విస్తృతంగా ఉన్నాయి. క్రిస్మస్‌ ఆచారాలను ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలేవీ లేవు. అదే ఈ పండుగ యొక్క గొప్పతనం. ప్రాంతం, దేశం, సమాజం ఆధారంగా ఆచారాలు మారినా, క్రిస్మస్‌ ఆత్మ మాత్రం ఒకటే.

Details

ఆచారాల్లో క్రిస్మస్ ట్రీ ముఖ్యమైనది

ఉదాహరణకు, శాంతా క్లాజ్‌ను బైబిల్‌లో ఒక పాత్రగా భావించే పురాణ కథలు ఉన్నాయి. పవిత్ర బైబిల్‌లో శాంతా క్లాజ్‌ను తెలుపు గడ్డం, ఎరుపు వస్త్రాలతో, సాధువు రూపంలో వర్ణించినట్టు చెబుతారు. క్రిస్మస్‌కు సంబంధించిన ప్రధాన ఆచారాలలో క్రిస్మస్‌ ట్రీ ముఖ్యమైనది. దీనికి మతపరమైన ప్రాధాన్యత ఉంది. అలాగే మిస్టేల్టోయ్‌ కింద నిలబడి ప్రేమికులు ముద్దు పెట్టుకోవాలనే సంప్రదాయం కూడా ప్రజలను మరింత దగ్గర చేసే ఆచారంగా భావిస్తారు. క్రిస్మస్‌ ఆచారాలు సరదాగా, ఉల్లాసంగా ఉండటం వల్ల ఈ పండుగ విరామాన్ని అందరూ ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తారు. సాధారణంగా ప్రతి దేశం, ప్రతి కమ్యూనిటీకి క్రిస్మస్‌ను జరుపుకునే ప్రత్యేక ఆచారాలు ఉంటాయి. అయినప్పటికీ, ఇక్కడ ప్రస్తావించిన సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు పాటించేవే.

Details

మిడ్‌నైట్‌ మాస్

క్రిస్మస్‌ వేడుకలు సాధారణంగా అర్ధరాత్రి నిర్వహించే మిడ్‌నైట్‌ మాస్‌తో ప్రారంభమవుతాయి. యేసుక్రీస్తు అర్ధరాత్రి సమయంలో జన్మించారన్న విశ్వాసం కారణంగా, ప్రతి చర్చిలో క్రిస్మస్‌ సందర్భంగా మిడ్‌నైట్‌ మాస్‌ను నిర్వహిస్తారు. బహుమతుల ఇచ్చిపుచ్చుకోవడం క్రిస్మస్‌ సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఎలా ప్రారంభమైందన్న ప్రశ్నకు చారిత్రక నేపథ్యం ఉంది. శిశువు యేసుకు ముగ్గురు జ్ఞానులు కానుకలు సమర్పించిన సంఘటన నుంచే ఈ ఆచారం వచ్చిందని భావిస్తారు. క్రిస్మస్‌ చెట్టు క్రిస్మస్‌ చెట్టును కేవలం అలంకరణ కోసమే ఉపయోగించరు. శీతాకాలంలోనూ పచ్చగా ఉండే ఈ చెట్టు కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు.

Advertisement

Details

శాంతా క్లాజ్‌ అసలు పేరు

శాంతా క్లాజ్‌ క్రిస్మస్‌తో ముడిపడి ఉన్న కల్పిత పాత్రగా చాలామంది భావిస్తారు. అయితే వాస్తవానికి ఎరుపు వస్త్రాలు ధరించిన ఈ ముద్దైన వృద్ధుడు పిల్లలు ఎంతో ప్రేమించే సెయింట్‌ నికోలస్‌ అనే వ్యక్తి ఆధారంగా రూపుదిద్దుకున్నాడని చెబుతారు. క్రిస్మస్‌ స్టాకింగ్స్‌ శాంతా క్లాజ్‌ చిమ్నీ ద్వారా ఇంట్లోకి వస్తాడన్న నమ్మకం ఉంది. అందుకే ఆయన తీసుకొచ్చే బహుమతులను స్వీకరించేందుకు చిమ్నీ దగ్గర స్టాకింగ్స్‌ను వేలాడదీయడం సంప్రదాయంగా మారింది. మిస్టేల్టోయ్‌ కిస్‌ మిస్టేల్టోయ్‌ను ఓక్‌ చెట్ల నుంచి కట్‌ చేసి తలుపులు, తోరణాల వద్ద ఉంచుతారు. ఒక అబ్బాయి, అమ్మాయిఒకేసారి మిస్టేల్టోయ్‌ కింద నిలిస్తే వారు ముద్దు పెట్టుకోవాలన్న సంప్రదాయం ఉంది. ఇది పురాతన గ్రీకు వివాహ సంప్రదాయాల నుంచి వచ్చినదిగా చెబుతారు.

Advertisement

Details

క్రిస్టింగేల్

క్రిస్టింగేల్‌ యేసుక్రీస్తు కాంతికి ప్రతీకగా భావిస్తారు. నారింజ రంగు బంతి భూమిని సూచిస్తే, దాని చుట్టూ కట్టిన ఎర్ర రిబ్బన్‌ యేసు రక్తాన్ని సూచిస్తుంది. పైభాగంలో వెలిగించే కొవ్వొత్తి క్రీస్తు వెలుగును సూచిస్తుంది. దాని చుట్టూ నాలుగు స్టిక్స్‌ అమర్చుతారు. హోలీ దండలు హోలీ మొక్కను క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారు. యేసుక్రీస్తు తన తలపై హోలీ మొక్క ముల్లతో చేసిన కిరీటాన్ని ధరించారన్న విశ్వాసం ఉంది. క్రిస్మస్‌ గీతాలు క్రిస్మస్‌ సందర్భంగా గీతాలు పాడడం ఆనవాయితీ. ప్రత్యేకంగా క్రిస్మస్‌ కోసం రూపొందించిన గీతాలు కాకపోయినా, 'నిశ్శబ్ద రాత్రి' వంటి గంభీరమైన శ్లోకాలు ఈ సందర్భంగా ఆలపిస్తారు.

Details

క్రిస్మస్‌ వైన్

క్రైస్తవ సంప్రదాయంలో క్రిస్మస్‌ వైన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వైన్‌ను యేసుక్రీస్తు రక్తానికి ప్రతీకగా భావిస్తారు. ఈ వైన్‌ను క్రైస్తవుల కోసం పవిత్ర రక్తంగా భావించడం సంప్రదాయంలో భాగంగా కొనసాగుతోంది.

Advertisement