Page Loader
Peepal leaf water : గుండె నుంచి జీర్ణం వరకు… రావి ఆకుల కషాయం తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
గుండె నుంచి జీర్ణం వరకు… రావి ఆకుల కషాయం తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Peepal leaf water : గుండె నుంచి జీర్ణం వరకు… రావి ఆకుల కషాయం తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిందూ మతంలో పవిత్రంగా భావించే రావి చెట్టు కేవలం ఆధ్యాత్మిక పరిమితుల్లో మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా ఎన్నో అద్భుతమైన లాభాలను అందిస్తుంది. ఆయుర్వేదంలో రావి చెట్టు ఆకులు, బెరడు, పండ్లు వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషధంగా వాడతారు. విశేషంగా, రావి ఆకుల కషాయం అంటే ఆకులను నీటిలో మరిగించి తాగడం వల్ల అనేక రోగాల నివారణ సాధ్యపడుతుంది. ఈ నీరు ఎప్పుడు, ఎలా తాగాలో, అందులో ఉండే ప్రయోజనాలేంటి అనే దానిపై ఓసారి పరిశీలిద్దాం.

Details

రావి ఆకుల నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

1. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు రాత్రిపూట నానబెట్టిన రావి ఆకుల నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల హార్ట్ బీట్ అసమతుల్యత, బలహీనత వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు గుండెను రక్షిస్తాయి. 2. జీర్ణవ్యవస్థకు బలము ఈ ఆకులలో 'లేక్సేటివ్ గుణాలు' ఉండటం వల్ల మలబద్ధకం పోయి, జీర్ణక్రియ చురుగ్గా మారుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. 3. షుగర్ నియంత్రణ (డయాబెటిస్) రావి ఆకులలోని గుణాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడం, గ్లూకోజ్‌ను శక్తిగా మారుస్తాయి. దీని వల్ల షుగర్ లెవల్స్‌ నియంత్రణలోకి వస్తాయి.

Details

4. శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనం

ఆస్తమా వంటి సమస్యల కోసం రావి కషాయాన్ని వాడితే ఊపిరితిత్తుల్లోని వాపు తగ్గి శ్వాసతీసుకోవడంలో సౌలభ్యం కలుగుతుంది. 5. చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారం దురద, ఎగ్జిమా వంటి చర్మ రుగ్మతలకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పనిచేస్తాయి. చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది. 6. కాలేయ ఆరోగ్యానికి మేలు జాండిస్ వంటి వ్యాధులకు రావి కషాయం ఉపయోగకరంగా ఉంటుంది. ఆకులను చక్కెరతో కలిపి తాగడం ద్వారా 'లివర్ డిటాక్సిఫికేషన్' జరుగుతుంది. 7. రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఫ్లేవనాయిడ్లు, ఇతర పోషకాలు శరీరానికి రక్షణ పెంచి 'ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి'ని అందిస్తాయి