Fruit cream: నవరాత్రులలో శక్తినిచ్చే ఫ్రూట్ క్రీమ్ రెసిపీ.. రోజంతా శక్తి
నవరాత్రుల సందర్భంలో, 9 రోజుల పాటు ఉపవాసం ఉన్నప్పుడు శక్తిని పెంచేందుకు కావలసిన ఆహారాలు చాలా ముఖ్యం. అందుకే, పండ్లు, డ్రై ఫ్రూట్స్, గింజలను ఎక్కువగా తీసుకుంటారు. కానీ ప్రతి రోజు పండ్లు తినడం కొంత బోరింగ్ గా అనిపించవచ్చు, కాబట్టి ఫ్రూట్ క్రీమ్ తయారు చేసుకోవడం సరైన మార్గం. ఈ ఫ్రూట్ క్రీమ్ మీకు రుచిని మాత్రమే కాదు, శక్తిని కూడా అందిస్తుంది. దీనిని తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో కాసేపు ఉంచితే రుచి మరింత పెరుగుతుంది.
ఫ్రూట్ క్రీమ్ తయారికి కావలసిన పదార్థాలు
మీగడ లేదా ఫ్రెష్ క్రీం: ½ కప్పు ఐస్ క్యూబ్స్ 1 ఆపిల్ 1 అరటిపండు 1 దానిమ్మ ½ బొప్పాయి 2 స్ట్రాబెర్రీలు 1 కివి గుప్పెడు బాదాం గుప్పెడు జీడిపప్పు గుప్పెడు ఎండుద్రాక్ష చక్కెర లేదా తేనె: రుచి ప్రకారం
ఫ్రూట్ క్రీమ్ తయారీ విధానం
ముందుగా, ఐస్ క్యూబ్స్‌ను ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోండి. వాటి మధ్యలో ఒక చిన్న గిన్నె ఉంచి, అందులో ఫ్రెష్ క్రీం లేదా మీగడ వేసి బాగా కలపాలి. కాసేపటికి,ఇది నురుగు లాంటి తేలికపాటి,క్రీమీగా అయిపోతుంది. అందులో చక్కెర లేదా తేనెను చేర్చి మరింత కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచండి. ఈ లోపు, అన్ని పండ్లను చిన్న ముక్కలుగా కోసుకోండి: అరటిపండు,దానిమ్మ,ద్రాక్ష,కివి,బొప్పాయి, స్ట్రాబెర్రీ ముక్కలు,డ్రై ఫ్రూట్స్‌ను కూడా ముక్కలుగా చేయండి. ఫ్రిజ్‌లో ఉంచిన క్రీం బయటకు తీసి,అందులో పండ్ల ముక్కలన్ని వేసి బాగా కలపాలి. మీ ఫ్రూట్ క్రీమ్ సిద్ధం అయ్యింది.. ఇక ఇప్పుడు సర్వ్ చేయండి! ఈ విధంగా మీరు రుచికరమైన ఫ్రూట్ క్రీమ్‌ను తినడం ద్వారా శక్తిని పొందవచ్చు.