దసరా నవరాత్రి 2023: దసరా నవరాత్రుల సమయంలో మీ పిల్లల్లో క్రియేటివిటీని పెంచే ఫన్ యాక్టివిటీస్
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల సమయంలో బంధువులు చుట్టాలు ఇంటికి వస్తుంటారు. దాంతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే పండగ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. పండగ సమయంలో పిల్లలు ఇంటి పనుల్లో రకరకాలుగా సాయం చేయాలని ట్రై చేస్తుంటారు. నవరాత్రుల్లో తమకు తోచిన డెకరేషన్ ఐడియాస్ తో పూజ గదిని అలంకరిస్తారు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నట్లయితే దసరా నవరాత్రుల సమయంలో వాళ్లతో చేయించాల్సిన ఫన్ యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోండి. పేపర్ దండలు: రకరకాల రంగుల్లోని పేపర్లను తీసుకొచ్చి వాటితో వివిధ రకాల ఆకారాల్లో దండలు తయారు చేయమని పిల్లలకు అప్పగించండి. ఆ దండలను పూజా మందిరానికి వేయండి.
రంగులు వేసిన దీపాలు
పండగ సమయంలో ఇంటిముందు ముగ్గు వేయడం అందరికీ అలవాటు. ఈ ముగ్గుల్లో కొంతమంది దీపాలను కూడా పెడతారు. ఈ దీపాలకు మీకు నచ్చిన రంగులు వేసి ముగ్గుల్లో ఉంచండి. పిల్లలకు ఎలాంటి రంగులు నచ్చుతాయో ఆ రంగులను దీపాలకు వేసి ముగ్గుల్లో ఉంచమని చెప్పండి. థర్మకోల్ ప్లేట్: చిన్నపిల్లలకు థర్మకోల్ తో ఆడుకోవడం భలే సరదాగా ఉంటుంది. ఒక పది అంగుళాల వ్యాసార్థం గల గుండ్రటి థర్మకోల్ ప్లేట్ తీసుకొచ్చి దానిమీద మిలమిల మెరిసే ఒక కాయితాన్ని అతికించండి. ఆ కాగితం పైన మీకు నచ్చిన ముగ్గు వేయండి. ఇప్పుడు ఆ ముగ్గు అవుట్ లైన్లో సాబుదాని గింజలను అతికించండి. ఇప్పుడు ఆ ముగ్గులో వివిధ రకాల రంగులను నింపండి.