Gandhi Jayanti 2024 : జాతిపిత గాంధీ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే ..
జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. అహింసా మార్గంలో నడిచి విజయాన్ని సాధించవచ్చని ఆయన నిరూపించిన విధానం అనేకమందిలో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చింది. అక్టోబర్ 2, మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా, ఆయన గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ చూద్దాం.
గాంధీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
1930లో టైమ్ మ్యాగజైన్ మహాత్మా గాంధీకి 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్' బిరుదును ఇచ్చింది. ఈ ఘనత పొందిన తొలి భారతీయుడు గాంధీ. గాంధీ సౌతాఫ్రికాలో ఏడాదికి 15,000 డాలర్లు సంపాదించేవారు. ఇప్పటికీ ఎంతోమంది ఈ స్థాయి సంపాదన కలగా భావిస్తారు. కానీ గాంధీ ఈ సంపాదనను వదిలి భారతదేశానికి తిరిగొచ్చారు. ఒకసారి రైలు దిగుతుండగా గాంధీ కాలికి ఉన్న ఒక చెప్పు ట్రాక్ మీద పడిపోయింది. వెంటనే ఆయన మరో చెప్పును కూడా పడేశారు. దాని వెనుక ఉద్దేశ్యం: ఎవరికైతే ఒక చెప్పు దొరికితే,ఆ వ్యక్తికి రెండో చెప్పు కూడా ఉపయోగపడాలని. 1906లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన బంబాథ అప్‌స్ప్రింగ్ యుద్ధంలో గాయపడిన బ్రిటీష్ సైనికులకు గాంధీ సహాయం అందించారు.
గాంధీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
గాంధీ రాసిన "మై ఎక్స్‌పరిమెంట్స్ విత్ ట్రూత్" 1927లో ప్రచురించబడింది. 20వ శతాబ్దంలో 100 అత్యంత ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. గాంధీ ఐరిష్ యాక్సెంట్‌లో ఇంగ్లీష్ మాట్లాడేవారు, ఎందుకంటే ఆయన మొదటి ఇంగ్లీష్ టీచర్ ఐరిష్ వ్యక్తి. గాంధీ శుక్రవారం పుట్టారు, శుక్రవారం మరణించారు, భారతదేశానికి స్వాతంత్ర్యం కూడా శుక్రవారం వచ్చింది! గాంధీకి "మహాత్మా" బిరుదును రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు. ఒకసారి గాంధీ ఠాగూర్‌ను "నమస్తే గురుదేవ్" అని సంబోధించగా, ఠాగూర్ "నేను గురుదేవ్ అయితే మీరు మహాత్ముడు" అని బదులిచ్చారు.