NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Vinayaka Chavithi 2024:  "ఏకవింశతి పూజ" అంటే ఏమిటి ? 21 పత్రాల వెనుకనున్న రహస్యం
    తదుపరి వార్తా కథనం
    Vinayaka Chavithi 2024:  "ఏకవింశతి పూజ" అంటే ఏమిటి ? 21 పత్రాల వెనుకనున్న రహస్యం
    "ఏకవింశతి పూజ" అంటే ఏమిటి ?

    Vinayaka Chavithi 2024:  "ఏకవింశతి పూజ" అంటే ఏమిటి ? 21 పత్రాల వెనుకనున్న రహస్యం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 06, 2024
    05:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు మరికొన్ని గంటల్లో మొదలు కానున్నాయి. మరి కొన్ని గంటలలో సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల పూజలు అందుకుంటారు.

    ఈ పూజలో పూలు, పళ్లతోపాటు రకరకాల పత్రాలను కూడా ఉపయోగిస్తారు.

    ముఖ్యంగా చవితి పర్వదినం సందర్భంగా 21 రకాల పత్రాలతో గణపతిని పూజిస్తారు.

    ఈ విధానాన్ని "ఏకవింశతి పూజ" అని పిలుస్తారు.

    ఈ పూజను మతపరంగా నిర్వహించినప్పటికీ, శాస్త్రపరంగా దీని వెనుక ఉన్న అర్థం మరింత లోతైనదని శాస్త్ర పండితులు చెబుతున్నారు.

    ప్రకృతితో మనిషి ఉన్న సంబంధం వల్ల, ప్రకృతిలోని ఔషధ సంపదను తదుపరి తరాలకు అందించడమే ఈ పూజ ముఖ్య ఉద్దేశం అని వారు వివరిస్తున్నారు.

    వివరాలు 

    21 పత్రాల వెనుకనున్న రహస్యం

    1) అగస్త్య పత్ర: ఆగస్త్య పత్రాలు కంటి సంబంధిత సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తాయని పురాతన గ్రంథాలు సూచిస్తున్నాయి.

    2) అర్జున పత్ర: అర్జున పత్రాలను తినడం వల్ల దంతపు ఎముకలు దృఢంగా ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది.

    3) అపామార్గ పత్ర: ప్రసూతి, గైనకాలజీ చికిత్సలో ఉపయోగించే ఈ పత్రాలు, ఆరోగ్యాన్నివరించడంలో సహాయపడతాయి.

    4) కరవీర పత్ర: చర్మ వ్యాధులు,హృదయ సంబంధిత చికిత్సలో కరవీర పత్రాలు ఉపయోగిస్తారు.

    5) కేతకీ పత్ర: నెయ్యి కలిపిన కేవడా పూల రసం మూత్ర సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది.

    6) జాజి పత్ర: జాజి ఆకులను మెత్తగా రుబ్బి గాయాలపై రాస్తే, అవి త్వరగా మానిపోతాయి. అల్సర్‌కి కూడా ఈ పత్రాలు ఉపయోగపడతాయి.

    వివరాలు 

    21 పత్రాల వెనుకనున్న రహస్యం

    7) దాదిమి పత్ర: ఈ పత్రాలు పేగు సంబంధిత వ్యాధులను నివారించడంలో ఉపయోగపడతాయి.

    8) బృహతి పత్ర: వంకాయ పండ్లు, గింజలు పంటి నొప్పి, దంతక్షయం తగ్గించడంలో సహాయపడతాయి.

    9) తులసి పత్ర: జలుబు, దగ్గు,జ్వరాన్ని తగ్గించేందుకు తులసి పత్రాలు ఉపయోగపడతాయి.

    10) దృవ పత్ర: దూర్వా పత్రం వేడిని చల్లార్చే శక్తి కలిగి ఉంది, ఇది ఆయుర్వేదంలో ప్రముఖ ఔషధ మొక్క.

    11) దేవదారు పత్ర: ఉబ్బసం, మధుమేహం నియంత్రణలో దేవదారు పత్రం సానుకూలంగా పనిచేస్తుంది.

    12) దాతురా పత్ర: శ్వాసకోశ వ్యాధులకు చికిత్సలో ఈ పత్రం సమర్థవంతమైన ఔషధంగా ఉపయోగిస్తారు.

    13) అశ్వథ పత్ర: మొటిమలు తగ్గించడంలో అశ్వథ ఆకులు బాగా పనిచేస్తాయి.

    వివరాలు 

    21 పత్రాల వెనుకనున్న రహస్యం

    14) బిల్వ పత్ర:ప్రేగు సంబంధిత వ్యాధుల కొరకు బిల్వ పత్రం ఒక మంచి ఔషధం.

    15) బదరీ పత్ర:ఈ పత్రాలను పచ్చడిగా చేసి అన్నంతో కలిపి తీసుకోవడం ద్వారా ఊబకాయం తగ్గుతుంది.

    16) మరువక పత్ర: ఇది సుగంధ ఆకులతో ప్రసిద్ధి చెందింది.

    17) సంధ్య పుష్పిన్ పత్ర:నోటి వ్యాధుల చికిత్సలో ఇది ముఖ్యమైన మొక్క.

    18) బృంగరాజ పత్ర:జుట్టు రంగు,పెరుగుదల కోసం బృంగరాజ పత్రాలు ఉపయోగపడతాయి.

    19) అర్క పత్ర:శరీరంలోని గ్రంధులను ఉత్తేజపరచి,వాటి పనితీరును మెరుగుపరచడంలో అర్క పత్రాలు సహాయపడతాయి.

    20) విష్ణు క్రాంత పత్ర:మనస్సును మెరుగుపరచడంలో ఈ పత్రం ప్రసిద్ధి చెందింది.

    21) శమీ పత్ర: శమీ అంటే 'శమయతి రోగాన్ ఇతి' అని అర్థం, అంటే రోగాలను తగ్గించేది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వినాయక చవితి

    తాజా

    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ
    Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక తెలంగాణ

    వినాయక చవితి

    Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
    Vinayaka Temples: భారతదేశంలోని ప్రసిద్ధ వినాయకుడి దేవాలయాలు  పండగ
    వినాయక చవితికి ముందు రోజు జరుపుకునే గౌరీ గణేష్ హబ్బా గురించి మీకు తెలుసా?  పండగ
    వినాయక చవితి: పర్యావరణం సురక్షితంగా ఉండేలా గణపతి డెకరేషన్ ఇలా చేయండి  పండగ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025