లంచ్ చేసాక నిద్ర ముంచుకొస్తుందా? నిద్ర రాకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు
మధ్యాహ్నం భోజనం చేయగానే కళ్ళు మూతలు పడిపోయినట్టుగా నిద్ర ముంచుకు రావడం చాలామందికి జరుగుతుంటుంది. అంతేకాదు, భోజనం చేయగానే అలసటగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. థైరాయిడ్, రాత్రి నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి, డయాబెటిస్ వంటి కారణాల వల్ల కూడా మధ్యాహ్నం నిద్ర వస్తుంది. ప్రస్తుతం మధ్యాహ్నం నిద్ర రావడానికి గల కారణాలను తెలుసుకొని నిద్రను దూరం చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. మధ్యాహ్నం నిద్రకు కారణాలు: కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల నిద్ర వస్తుంది. భోజనానికి భోజనానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం, కావలసిన దానికంటే అధికంగా తినడం, అధిక మెలటోనిన్, ట్రిప్టోఫాన్ ఆహారాల వల్ల కూడా నిద్ర వస్తుంది.
మధ్యాహ్నం నిద్ర దూరం కావాలంటే చేయాల్సిన పనులు
భోజనం చేసిన తర్వాత అలసటగా ఉండి కళ్ళు మూతలు పడిపోతుంటే 15-20 నిమిషాల పాటు నిద్రపోవడం మంచిది. దీనివల్ల అలసట తీరిపోయి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. రాత్రిపూట కనీసం 6- 8 గంటల పాటు కచ్చితంగా నిద్రపోవాలి. రాత్రి సరిగ్గా నిద్రపోతే మధ్యాహ్నం నిద్ర రాకుండా ఉంటుంది. రోజులో కొంతసేపు ఎండకు నిలబడటం, రోజులో కనీసం అరగంట వ్యాయామం, భోజనం చేసిన తర్వాత నిద్ర రాకుండా కొన్ని యోగాసనాలు కూడా చేయవచ్చు. ఇంకా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోకుండా ఉంటే మధ్యాహ్నం నిద్ర రాకుండా ఉంటుంది. శరీరానికి పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా మద్యాహ్న నిద్రను దూరం చేయవచ్చు.