Ginger for Winter : చలికాలంలో ఆరోగ్యం కోసం అల్లం సూపర్ ఫుడ్.. తింటే ఈ వ్యాధుల నుంచి ఉపశమనం!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేయడం అవసరం. ప్రత్యేకంగా అల్లాన్ని డైలీ డైట్లో చేర్చడం ఎంతో ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు. అల్లం తీసుకోవడం వల్ల చలికాలంలో శరీరానికి లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి: చలిలో శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచే థర్మల్ గుణాలు అల్లంలో సమృద్ధిగా ఉంటాయి. చేతులు, కాళ్లు చల్లబడడం, వణుకు, అలాగే చలి ఎక్కువగా అనిపించడం వంటి లక్షణాలను తగ్గించడంలో ఇది సాయపడుతుంది. అందుకే చలికాలంలో అల్లం టీ లేదా అల్లం కషాయం తాగాలని వైద్యులు సూచిస్తారు. అల్లంలో సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Details
ఆహారం త్వరగా జీర్ణమవుతుంది
రోజూ చిన్న మోతాదులో అల్లం తీసుకుంటే జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లకు శరీరం మరింత బలంగా ఎదుర్కొంటుంది. చలికాలంలో జీర్ణక్రియ మందగించడం సాధారణం. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, బరువుగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి. అల్లం జీర్ణ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేసి ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందు లేదా తరువాత అల్లం తీసుకోవడం కడుపుని తేలికగా ఉంచుతుంది. చలికాలంలో గొంతు నొప్పి, కఫం, దగ్గు సమస్యలు పెరుగుతాయి. అల్లంలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపును తగ్గిస్తాయి. అల్లం టీ లేదా అల్లం-తేనెతో వేడి నీరు తాగితే వేగంగా ఉపశమనం లభిస్తుంది. అల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
Details
శరీర నొప్పులను తగ్గించడంలో సాయపడతాయి
చలికాలంలో రక్తప్రవాహం మందగించడం వల్ల వచ్చే తిమ్మిరి, చిన్న చిన్న నొప్పులు, అలసట వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణ సరిగా ఉండడంతో శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది, మీరు మరింత చురుకుగా ఉంటారు. అల్లం సహజమైన నొప్పినివారిణిలా పనిచేస్తుంది. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు, కండరాల ఒత్తిడి, ఇతర శరీర నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా అల్లం తీసుకోవడం దీర్ఘకాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం అందిస్తుంది.