Long weekends 2026 : ట్రావెల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చే ఏడాది ట్రిప్ ప్లానింగ్ ఇలా ఇస్తే సులభం
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త సంవత్సరం ఇంకా రాకముందే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం ఎప్పుడూ ఉత్తమమే. ముఖ్యంగా ప్రయాణాలు ఇష్టపడే వారికి 2026 క్యాలెండర్ నిజంగా గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది. వచ్చే ఏడాది పండుగలు, ప్రభుత్వ సెలవులు వారాంతాలకు దగ్గరగా రావడంతో కేవలం ఒకటి లేదా రెండు రోజులు లీవ్ పెట్టినా చాలు... పొడవాటి లాంగ్ వీకెండ్స్ మీ చేతిలోకి వస్తాయి. ట్రావెల్ ప్లాన్స్ చేసుకునేందుకు అనువుగా 2026లో నెలవారీగా లభించే లాంగ్ వీకెండ్స్ వివరాలు ఇవీ.
Details
జనవరి: కొత్త ఏడాదికి గ్రాండ్ స్టార్ట్
జనవరి నెలలోనే ట్రావెల్ లవర్స్‌కు రెండు మంచి అవకాశాలు ఉన్నాయి. జనవరి 1 నుంచి 4 వరకు జనవరి 1 గురువారం కొత్త సంవత్సరం. జనవరి 2 శుక్రవారం ఒక్క రోజు సెలవు తీసుకుంటే, శని-ఆదివారాలతో కలిపి మొత్తం నాలుగు రోజుల మినీ వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. జనవరి 23 నుంచి 26 వరకు జనవరి 23 శుక్రవారం వసంత పంచమి, 26 సోమవారం గణతంత్ర దినోత్సవం. మధ్యలో శని, ఆదివారాలు ఉండడంతో వరుసగా నాలుగు రోజుల విరామం దొరుకుతుంది.
Details
ఫిబ్రవరి - మార్చి: పండుగల హడావుడి
ఫిబ్రవరిలో మహాశివరాత్రి (15వ తేదీ) ఆదివారం రావడంతో పెద్దగా లాంగ్ వీకెండ్ కలిసి రాకపోయినా, నెల చివర నుంచి మార్చి ప్రారంభం వరకు హోలీ సెలవులు మంచి అవకాశం ఇస్తాయి. మార్చి 1 నుంచి 3 వరకు మార్చి 2 సోమవారం సెలవు తీసుకుంటే, మార్చి 3న హోలీతో కలిపి మూడు రోజుల విరామం లభిస్తుంది. మార్చి 20 నుంచి 22 వరకు మార్చి 20 శుక్రవారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) ఉండడంతో, ఆ వారాంతం మొత్తం హ్యాపీగా గడిపే ఛాన్స్ ఉంటుంది.
Details
మార్చి 26 నుంచి 31 వరకు
మార్చి చివర్లో అసలు పెద్ద సర్ప్రైజ్ ఉంది. మార్చి 26 గురువారం శ్రీరామనవమి, 31 మంగళవారం మహావీర్ జయంతి. మధ్యలో 27, 30 తేదీల్లో సెలవు పెట్టుకుంటే, మొత్తం ఆరు రోజుల సుదీర్ఘ విరామం దక్కుతుంది. ఇది లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయడానికి బెస్ట్ టైమ్. ఏప్రిల్ - మే: వేసవిలో ట్రావెల్‌కు చక్కని ఛాన్స్ వేసవి వేడి నుంచి తప్పించుకుని కొండ ప్రాంతాలు, హిల్ స్టేషన్లకు వెళ్లాలనుకునేవారికి ఏప్రిల్, మే నెలల సెలవులు చాలా ఉపయోగపడతాయి. ఈ పండుగలు, వారాంతాలను కలిపి చక్కని విహారయాత్రలను ఆస్వాదించవచ్చు. మొత్తానికి, 2026లో లాంగ్ వీకెండ్స్ కోసం సెలవులు వృథా చేయాల్సిన పనిలేదు.సరైన ప్లానింగ్‌తో తక్కువ లీవ్స్ పెట్టి ఎక్కువ ప్రయాణ ఆనందాన్ని పొందొచ్చు.