Green Tea : డయాబెటిస్ వారికి గ్రీన్ టీ ఔషధం.. రోజుకు రెండుసార్లు తాగితే బిగ్ రిలీఫ్
మధుమేహం(డయాబెటిస్) బాధితులు ఎంత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపితే, అంత లాభం ఉంటుంది. ఫలితంగా ఈ వ్యాధి అంత అదుపులో ఉంటుంది. ఓ పక్క తాజా ఆహారాన్ని స్వీకరిస్తూ, మరోపక్క ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇంకోపక్క వ్యాయామం చేస్తుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. దీంతో పాటు మధుమేహం ఉన్నవారు పలు రకాల వాటిని ప్రత్యేకంగా తీసుకోవాలి. వాటిల్లో గ్రీన్ టీ ఒకటి కీలకం. సాధారణ వ్యక్తులకూ గ్రీన్ టీ తాగడం శ్రేయస్కరమే. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. పైగా యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేవే. అంతేకాకుండా బరువు తగ్గించుకునేందుకు అధిక రక్తపోటును కంట్రోల్ చేయడానికి గ్రీన్ టీ ఉపకరిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు రెండు కప్పుల గ్రీన్ టీ తాగేందుకు ప్రయత్నించాలి.
గ్రీన్ టీ తాగితే గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ మేరకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించేందుకు ఎంతో కృషి చేస్తుంది. గ్రీన్ టీతో అదనపు బలం ఏంటంటే, జీర్ణక్రియ వేగాన్ని పెంచి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. గ్రీన్ టీలో కొటెకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇక టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు గ్రీన్ టీ సేవిస్తే యాంటీ ఆక్సిడెంట్,కోటెకిన్ రక్తంలో చక్కెర స్థాయిలను రెగ్యులరైజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు రెండు కప్పుల గ్రీన్ టీ తాగేందుకు ప్రయత్నించాలి. గుండె ఆరోగ్యానికి గ్రీన్ టీ మంచిదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.