తుప్పు పట్టిన గేట్లు, పాడైపోయిన మొక్కలతో గార్డెన్ ని అందంగా మార్చే జపనీస్ టెక్నిక్
జపాన్ లో గార్డెన్ ను పెంచేవారు వాబి సాబి అనే టెక్నిక్ ని ఉపయోగిస్తారు. ఈ టెక్నిక్ ప్రకారం గార్డెన్ ని పెంచితే సహజంగా ఉంటుంది. ఈ టెక్నిక్ లో మూడు విషయాలు పాటిస్తారు. ఏదీ పర్ఫెక్ట్ కాదు, ఏదీ శాశ్వతం కాదు, ఏదీ సంపూర్ణం కాదు. ఈ మూడు విషయాలను అనుసరిస్తూ గార్డెన్ ని ఏ విధంగా అందంగా డిజైన్ చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. తుప్పు పట్టిన గేట్లు: మీరు మీ గార్డెన్ ఎంట్రీ గేటుకు తుప్పు పట్టినట్లుగా పేయింట్ వేయించండి. వాబి సాబి లోని ఏదీ పర్ఫెక్ట్ కాదనే విషయాన్ని ఇక్కడ వర్తింప జేయాలి. అలాగే పాతకాలం నాటి గొళ్ళెంను గేటుకు బిగించండి.
ప్రకృతి సిద్ధంగా గార్డెన్ ని పెంచడానికి సూచనలు
కాలాన్ని బట్టి మారిపోయే మొక్కలను తీసుకురండి: మీ గార్డెన్ లో కాలాన్ని బట్టి మారిపోయే మొక్కలను పెంచండి. కొన్ని మొక్కలు ఒక్కో కాలంలో ఒక్కోలా ఉంటాయి. మొక్కల నుండి రాలిన ఆకులను ప్రతీరోజూ ఊడ్చేయకుండా అలానే వదిలేయండి. బండరాళ్ళను తోట మధ్యలో ఉంచండి: పెద్ద బండరాళ్ళను తోట మధ్యలో ఉంచండి. వాటి చుట్టుపక్కల నాచు, లైకేన్ మొక్కను పెరగనివ్వండి. వీటివల్ల మీ గార్డెన్ కి సహజమైన లుక్ వస్తుంది. పెద్ద పెద్ద కర్ర మొద్దులను అలానే వదిలేయండి: మీ గార్డెన్ లో చెక్కమొద్దులు ఉన్నట్లయితే వాటిని అలానే ఉంచండి. ఎన్నిరోజులైనా అలానే ఉంచేయండి. అలా ఉంచడం వల్ల ఆ చెక్కమొద్దుల్లో కొన్ని జీవాలు నివాసం ఏర్పర్చుకుంటాయి.