జుట్టుకు మృదుత్వాన్ని, అందాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ గురించి తెలుసుకోండి
జుట్టుకు కావాల్సిన ఆరోగ్యాన్ని అందిస్తామని చెప్పి మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ వస్తుంటాయి. అదే మాదిరిగా ఇటీవల హెయిర్ టోనర్ వచ్చింది. జుట్టుకు అందాన్ని, సరైన ఆకారాన్ని తీసుకొచ్చే హెయిర్ టోనర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. హెయిర్ టోనర్ అంటే ఏమిటి? ఇది హెయిర్ కలర్ కు సంబంధించిన వస్తువు. దీనిలో చాలా తక్కువ అమోనియా లేదా కొన్నిసార్లు అమోనియా అసలే ఉండదు. జుట్టు రంగును మరింత ప్రకాశవంతంగా చేస్తుంది. హెయిర్ టోనర్ ఎందుకు ఉపయోగించాలి? ఇప్పుడున్న మీ జుట్టు రంగును హెయిర్ టోనర్స్ మరింత మెరిసేలా చేస్తాయి. ఇంకా జుట్టును ఆరోగ్యంగా మార్చుతాయి. మీ జుట్టు నెరసిపోకముందు ఏ రంగులో ఉందో ఆ రంగును మీ జుట్టుకు మళ్ళీ తీసుకొస్తాయి.
హెయిర్ టోనర్స్ ఎలా వాడాలి, హెయిర్ టోనర్లలోని రకాలు
హెయిర్ టోనర్లలో చాలా రకాలున్నాయి. ఆ రకాలన్నీ మీ పాతజుట్టు తాలుకు రంగును మళ్ళీ తీసుకొస్తాయి. హెయిర్ టోనర్ గ్లాజెస్ ఉపయోగించవచ్చు, బ్లూ లేదా పర్పుల్ కలర్ తో కూడిన హెయిర్ టోనర్ షాంపూలను కూడా వాడవచ్చు. టోనర్ ఎలా వాడాలి? 1:2నిష్పత్తిలో టోనర్ ని డెవలపర్ లో మిక్స్ చేసి జుట్టుకు మర్దన చేసుకోవాలి. ముఖ్యంగా వెంట్రుకల కొసలకు బాగా మర్దన చేయాలి. 45నిమిషాల తర్వాత షాంపూ లేదా కండీషనర్ తో కడిగితే సరిపోతుంది. ఆరు వారాలకు ఒకసారి వాడటం మంచిది. టోనింగ్ షాంపూ వాడుతున్నట్లయితే తడి జుట్టుకు షాంపూని మర్దన చేసుకుని 20నిమిషాల తలస్నానం చేస్తే సరిపోతుంది. టోనింగ్ జాగ్రత్తలు టోనింగ్ అయ్యాక ఎండలో తిరగకుండా ఉంటే మంచిది.