మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే ఈ ఆహారాలను తినడం మానుకోండి
జుట్టు ఊడిపోవడానికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మీ జుట్టుకు కావాల్సిన పోషకాలు సరిగ్గా అందకపోవడం వల్ల వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఎలాంటి ఆహారాలను తీసుకుంటే జుట్టుకు సమస్య అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం. ప్రాసెస్ చేసిన చక్కెర: దీనివల్ల రక్తంలో చెక్కెర స్థాయిలు పెరుగుతాయి. అప్పుడు మీ శరీరం ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఆండ్రోజన్ అనే హార్మోన్ స్థాయిలు పెరిగి కుదుళ్ళు వదులుగా తయారయ్యి వెంట్రుకలు రాలిపోతాయి. తక్కువ ప్రోటీన్: వెంట్రుకలలో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మీరెప్పుడైతే ప్రోటీన్ ఉన్న ఆహారాలను సరిగ్గా తీసుకోలేరో, అప్పుడు వెంట్రుకలకు కావాల్సిన కెరాటిన్ సరైన మోతాదులో అందదు. దాంతో జుట్టు పొడిబారిపోయి ఊడిపోతూ ఉంటుంది.
జుట్టు రాలిపోవడానికి కారణమయ్యే మరికొన్ని ఆహారాలు
పచ్చిగుడ్డు: గుడ్డులో బయోటిన్ (విటమిన్ బి) ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. కెరాటిన్ ప్రోటీన్ లో బయోటిన్ ఉంటుంది. ఎప్పుడైతే కెరాటిన్ లో బయోటిన్ లోపించిందో అప్పుడు వెంట్రుకలు బలహీనం అవుతాయి. కానీ పచ్చిగుడ్డు వల్ల వెంట్రుకలకు బయోటిన్ అందదు. దానివల్ల వెంట్రుకలు ఊడిపోతుంటాయి. కార్బోనేట్ డ్రింక్స్: వీటిల్లో కృత్రిమ తీపి పదార్థాలు కలుపుతారు. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. వెంట్రుకల కుదుళ్ళకు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల వెంట్రుకలు ఊడిపోతాయి. గ్లిసమిక్ ఇండెక్స్ అధికం గల ఆహారాలు: వీటిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అమాంతం పెరుగుతుంది. అప్పుడు ఆండ్రోజన్ పెరిగి వెంట్రుకల ఆరోగ్యం పాడవుతుంది.