NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / హనుమాన్ జయంతి విశేషాలు: హనుమాన్ చాలీసా ఎవరు రాసారో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    హనుమాన్ జయంతి విశేషాలు: హనుమాన్ చాలీసా ఎవరు రాసారో తెలుసా?
    హనుమాన్ జయంతి విశేషాలు

    హనుమాన్ జయంతి విశేషాలు: హనుమాన్ చాలీసా ఎవరు రాసారో తెలుసా?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 06, 2023
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు జన్మించిన రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ పవిత్ర పర్వదినాన, ఆంజనేయ భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆంజనేయుడి గుడికి వెళ్తారు.

    కొందరు ఉపవాస దీక్షలు చేపడతారు. మరికొంతమంది ఆంజనేయ మాలలు వేసుకుంటారు. ప్రతీ ఊరిలో హనుమంతుడి గుడి వద్ద అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి.

    ఆంజనేయుడిది శివుడి రూపమని అంటారు. వానర రాజైన కేసరి, అంజని దంపతులకు హనుమంతుడిగా శివుడు జన్మించారని చెబుతారు. రాముడికి సాయం చేయడం కోసమే హనుమంతుడి జననం సంభవించిందని అంటారు.

    హనుమాన్ జయంతిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోరోజు జరుపుకుంటారు. ఉత్తరాది రాష్ట్రాలు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు చైత్ర మాసంలోని శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.

    హనుమాన్ జయంతి

    తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా

    భక్తికీ, అంకితభావానికీ హనుమంతుడు ప్రతీకగా నిలుస్తాడు. తన జీవితాన్ని రాముడి సేవ కోసం అర్పించేసాడు. సీతారాముడి తన గుండెల్లో నిలుపుకున్న హనుమంతుడు, భక్తిలో శిఖరాగ్రాన నిలిచాడు.

    హనుమాన్ జయంతి రోజున భక్తులందరూ హనుమంతుడి భక్తిలో సేదదీరుతారు. ఉపవాసాలు, దీక్షలు, అన్నదాన కార్యక్రమాలతో హనుమంతుడి ఆశీస్సులు పొందుతారు.

    హనుమాన్ చాలీసాను పఠిస్తారు. ఇంతకీ హనుమాన్ చాలీసా ఎవరు రాసారో తెలుసా?

    16వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత రచయిత తులసీదాస్, హనుమాన్ చాలీసాను రచించారు.

    ఆ తర్వాత అనేక భాషల్లోకి హనుమాన్ చాలీసా తర్జుమా అయ్యింది.

    హనుమాన్ జయంతి రోజున పట్టణాలు, టౌన్లు, గ్రామాల్లో ర్యాలీలు తీస్తుంటారు. హనుమంతుడి పాటలతో భజనలు చేస్తుంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పండగ
    పండగలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పండగ

    క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి లైఫ్-స్టైల్
    పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి ప్రైమ్
    క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత లైఫ్-స్టైల్

    పండగలు

    మహాశివరాత్రి పండగ రోజు ఉపవాసం ఉన్నవారు తినగలిగే ఆహారాలు పండగ
    రంజాన్ 2023: విశేషాలు, ఆచారాలు, ఉపవాస నియమాలు పండగ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025