Holi Wishes In Telugu 2026: కలర్ ఫుల్ హోలీ శుభాకాంక్షలు.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ మెసేజ్‌లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
'హోలీ' అంటే అగ్నితో పునీతమైనదనే అర్థం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలికా పూర్ణిమ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుడిని సంహరించాలనే ఉద్దేశంతో హిరణ్యకశ్యపుడు తన చెల్లెలు హోలికకు అతడిని అప్పగిస్తాడు. అగ్నిలోకి ప్రహ్లాదుడితో కలిసి దిగిన హోలిక దహనమైపోతుంది. భక్తి విజయం సాధించిన ఆ సంఘటనకు గుర్తుగా హోలికా దహనం నిర్వహించే ఆనవాయితీ ఏర్పడింది. శ్రీకృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనాల్లో ఈ పండుగను 16 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు.
Details
ఈ ఏడాది హోలీ ఎప్పుడు?
ఈసారి పౌర్ణమి తిథి రెండు రోజులకు వ్యాపించడంతో హోలీ ఏ రోజున జరుపుకోవాలన్న సందిగ్ధత నెలకొంది. అయితే రాత్రివేళ పౌర్ణమి ఉండడమే ప్రధానంగా పరిగణిస్తారు. హోలికా దహనం కూడా రాత్రే నిర్వహిస్తారు.
మార్చి 13, గురువారం ఉదయం 10:20 వరకు చతుర్ధశి తిథి ఉంటుంది. ఆ తర్వాత పౌర్ణమి ప్రారంభమవుతుంది. అంటే ఆ రాత్రి పౌర్ణమి ఉంటుంది.
మార్చి 14, శుక్రవారం ఉదయం 11:29 వరకు పౌర్ణమి తిథి కొనసాగుతుంది. అంటే సూర్యోదయానికి పౌర్ణమి ఉంటుంది.
రాత్రి హోలికా దహనం నిర్వహించే వారు మార్చి 13న జరుపుకుంటారు. రంగులు చల్లుకునే వేడుకను మాత్రం మార్చి 14 ఉదయం, పౌర్ణమి ఘడియలు ముగిసేలోపు నిర్వహిస్తారు.
Details
హోలీ శుభాకాంక్షలు
రంగుల పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులకు పంపేందుకు కొన్ని సందేశాలు...
1) సప్తవర్ణాల శోభితమైన పండుగ
వసంతశోభ వెల్లివిరిసే వేడుక
రంగుల కేళీ హోలీ శుభాకాంక్షలు
2) రాక్షస పీడ తొలగిపోయిన విజయానికి ప్రతీక హోలీ
మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు
3) సుఖసంతోషాలకు సంకేతం
హోలీ పండుగ అందరికీ హోలీ శుభాకాంక్షలు
4) రంగురంగుల స్నేహాలు
కలర్‌ఫుల్ బంధుత్వాలు
అందరికీ ఆనందాలు పంచే హోలీ శుభాకాంక్షలు
5) రంగులన్నీ ఉంటేనే ప్రకృతికి అందం
మతాలన్నీ కలిసుంటేనే దేశానికి అందం
హోలీ శుభాకాంక్షలు
Details
హోలీ శుభాకాంక్షలు1/2
6) రంగుల పండుగ వచ్చింది
హరివిల్లు నేలను దించింది
అందరికీ హోలీ శుభాకాంక్షలు
7) ప్రతి సీజన్‌లో రంగులు మారుతాయి
ప్రతి రోజులోనూ రంగులుంటాయి
మీ జీవితం రంగులతో నిండిపోవాలి
హోలీ శుభాకాంక్షలు 2025
8) హోలీ రోజు చల్లుకునేది కేవలం రంగులు మాత్రమే కాదు
అనురాగం, ఆప్యాయతల జల్లులు కూడా ]
హోలీ శుభాకాంక్షలు ఎక్కువ ఆనందించండి, తక్కువ ఆలోచించండి
9) ఆనందపు రంగు, స్నేహపు రంగు, ప్రేమ రంగు
ఈ రంగులన్నీ మీ జీవితంలో నిండాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు
10) ఈ హోలీ మీ కుటుంబ జీవితాల్లో కొత్త రంగులు నింపాలని కోరుకుంటూ
హ్యాపీ హోలీ 2025