ఫాదర్స్ డే జరుపుకోవడం ఎప్పటి నుండి మొదలైంది? ఈరోజున పంచుకోవాల్సిన కొటేషన్లు
ఈ సంవత్సరం జూన్ 18వ తేదిన ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. తండ్రులు చేసే త్యాగాలను గుర్తించడానికి, తండ్రిగా నెరవేరుస్తున్న బాధ్యతను గౌరవించడానికి ప్రతీ ఏడాది జూన్ మూడవ ఆదివారం రోజున ఫాదర్స్ డే జరుపుతున్నారు. ఫాదర్స్ డే చరిత్ర: మొదటిసారిగా ఫాదర్స్ డే ని అమెరికాలో జరుపుకున్నారు. 1910సంవత్సరంలో వాషింగ్టన్ రాష్ట్ర ప్రజలు జూన్ 19వ తేదీన ఫాదర్స్ దే జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది పాకింది. ప్రతీ ఏడాది మదర్స్ డే జరుపుకుంటున్నారు కాబట్టి ఫాదర్స్ డే జరుపుకోవాలన్న నిర్ణయంతో అమెరికాలో ఫాదర్స్ డేని జరుపుకోవడం ప్రారంభించారు. ఈ సంవత్సరం ఫాదర్స్ డే రోజున మీ తండ్రులతో పంచుకోవాల్సిన కొటేషన్లు ఏంటో చూద్దాం.
ఫాదర్స్ డే కొటేషన్లు
నాకు స్నేహితుడిగా ఉంటూ, నా జీవితంలో వెలుగు నింపిన నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు నేను బతుకున్న జీవితం, నాకున్న అనుభవాలు నాకు ఇచ్చిన ప్రపంచంలోనే అతి గొప్ప తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నీ జీవితంలో మరింత నవ్వులను, మరింత ఆనందాన్ని, ఈ ఫాదర్స్ డే తీసుకువస్తుందని కోరుకుంటూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నాకు నడక నేర్పించి, బడికి పంపించి చదువు నేర్పించి, తప్పటడుగుల్లో జీవితాన్ని నేర్పించి, నా విజయంలో కీలక పాత్ర పోషించి, చివరకు నాకెంతో చేసావు నాన్న అని చెప్తే, నేనేం చేసానురా అంటూ ఏమీ చేయలేదని గొప్పంతా నాదే చేసే నాన్న.. నీకు నేనెన్ని చేసినా అన్నీ తక్కువే.. హ్యాపీ ఫాదర్స్ డే.