Happy Friendship Day: మీ స్నేహితులకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
స్నేహితుల దినోత్సవం రోజున మీ స్నేహితుల కోసం మంచి బహుమతిని అందివ్వడమనేది పెద్ద టాస్క్. ఏదో ఇచ్చేసాలేం అన్నట్టుగా కాకుండా అవతలి వారు ఎప్పటికీ మర్చిపోలేని బహుమతిని అందిస్తే బాగుంటుంది.
స్నేహితుల దినోత్సవం వచ్చేస్తుంది కాబట్టి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుందో మీకు తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి.
మీరు స్వయంగా చేసిన వస్తువులు:
మీ చేతులతో ఏదైనా బహుమతి తయారు చేసి అందిస్తే ఆ కిక్కే వేరు. మీరు రాసిన చిన్న కవిత గానీ, ఏదైనా పెయింటింగ్, ఏదైనా డిజైన్.. ఇలా మీ చేతులతో చేసి గిఫ్ట్ ఇవ్వండి.
మెమరీ జర్నల్స్:
మీరు మీ ఫ్రెండ్ కలిసి చేసిన అల్లరి పనులను ఒక డైరీలో రాసి ఇవ్వండి.
Details
డైరీలో ఫోటోలు అతికించండి
చిన్నప్పుడు దిగిన ఫోటోలను ఒక డైరీలో అతికించి వాటికి అందమైన క్యాప్షన్ జోడించడం, గతకాలపు అనుభవాలను ఎర్చి కూర్చి మీ చేత్తో రాసి ఇస్తే ఆ బహుమతిని మీ స్నేహితులు ఎప్పటికీ మర్చిపోలేరు.
రాశి గుర్తులతో ఆభరణాలు:
రాశుల గుర్తులతో ఆభరణాలు ధరించడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. మీ స్నేహితుడు ఏ రాశిలో పుట్టాడో తెలుసుకుని ఆ రాశి గుర్తుతో ఆభరణం తయారు చేయించండి.
నియాన్ సైన్ లైట్:
మీ స్నేహితుడి అభిరుచుల ప్రకారం నియాన్ గుర్తును తయారు చేయించండి. ఆ గుర్తును హాల్ లేదా బెడ్ రూమ్ లో ఉంచితే బాగుంటుంది. ప్రస్తుతం ఈ బహుమతులు ట్రెండింగ్ లో ఉన్నాయి.
Details
వ్యంగ్య చిత్రాలు
మీ స్నేహితుడి ఫోటోను కార్టూన్ బొమ్మ మాదిరిగా గీసి గిఫ్ట్ గా అందించండి. మీ గిఫ్ట్ అందించడంలో మీ స్నేహితులను కూడా కలుపుకోండి. ఈ బహుమతి ఖచ్చితంగా మీ స్నేహితుడి పెదాల మీద నవ్వును తీసుకొస్తుంది.
అవతలి వాళ్ళను నవ్వించడం కన్నా మంచిపని మరేముంటుంది. అందుకే మీ చేతికి పని చెప్పండి, మీ ఫ్రెండ్ ఫేస్ ని కార్టూన్ లో ఊహించుకోండి.