
Friendship Day:ఈ సంవత్సరం ఫ్రెండ్ షిప్ డే ని మీ గ్యాంగ్ తో ఇలా జరుపుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ట్రెండు మారినా ఫ్రెండు మారడే అన్న వాక్యం అక్షరాలా నిజం. నిజమైన స్నేహితుడు ఎప్పుడు మారడు. నువ్వెలా ఉన్నా నీతో పాటు పక్కనే ఉంటాడు. నువ్వు నాకేం చేసావని అడగని బంధం ఏదైనా ఉందంటే అది ఫ్రెండ్ షిప్ మాత్రమే.
ఈ సంవత్సరం ఫ్రెండ్ షిప్ డే ని మీ గ్యాంగ్ తో వెరైటీగా జరుపుకోండి. ఎలా జరుపుకోవాలో మీకు తెలియకపోతే ఇక్కడ చూడండి.
సాహస క్రీడలు:
మీ గ్యాంగ్ అందరికీ ట్రావెలింగ్ ఇష్టమైతే సాహస క్రీడలు అందుబాటులో ఉండే ప్రదేశాలకు వెళ్ళండి. సాహస క్రీడలు మంచి అనుభూతిని అందిస్తాయి. గ్యాంగ్ తో పాటు సాహసాలు చేస్తే ఆ థ్రిల్లే వేరు.
Details
ప్లానింగ్ లేకుండా రోడ్ ట్రిప్
ట్రెక్కింగ్:
గోవా, కర్ణాటక సరిహద్దులో దూద్ సాగర్ జలపాతం చూడటానికి చేసే ట్రెక్కింగ్, బెంగళూరు నంది కొండల మీదుగా సాగే ట్రెక్కింగ్ అద్భుతంగా ఉంటుంది.
కారావోకే:
దీన్నే గతంలో అంత్యాక్షరి అని చెప్పుకునేవారు. ఇంట్లో హ్యాపీగా డిన్నర్ చేసి అందరూ ఒక దగ్గర చేరి బ్యాగ్రౌండ్ లో మ్యూజిక్ వస్తుంటే పాటలు పాడుతూ ఉండండి. గ్యాంగ్ తో చేసేది కదా గమ్మత్తుగా ఉంటుంది.
రోడ్ ట్రిప్:
ఒక ప్రదేశానికి వెళ్ళాలనే ప్లాన్ లేకుండా రోడ్ ట్రిప్ ప్లాన్ చేయండి. కార్లో పాటలు, మాటలు, హైవే దాబాలో భోజనాలు మీకు మంచి ఫీలింగ్ అందిస్తాయి.
ఇవన్నీ మీకు కుదరకపోతే మద్యాహ్నం లంచ్ చేసి, టీవీలో ఈ నగరానికి ఏమైంది సినిమా పెట్టుకుని హ్యాపీగా చూసేయండి.